Viral Video: తనను కరిచిన పామును ఆస్పత్రికి తీసుకొచ్చి.. మెడలో వేసుకుని హల్‌చల్
ABN, Publish Date - Oct 16 , 2024 | 06:20 PM
సాధారణంగా ఏదైనా పాము కనిపిస్తే చాలు పరిగెత్తుకెళ్తాం. కానీ ఓ వ్యక్తి మాత్రం ప్రమాదకర విషసర్పం కాటేసినా కూడా తగ్గేదేలే అంటూ ఏ మాత్రం భయపడకుండా దానిని తీసుకుని ఆస్పత్రికి వెళ్లి హల్‌చల్ సృష్టించాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చెక్కర్లు కోడుతోంది.
ఎవరైనా ప్రమాదకరమైన రక్త పింజర(russells viper) పాములు కనిపిస్తే దూరంగా పరిగెడతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తనను కాటేసినా కూడా భయపడకుండా అదే పామును పట్టుకున్నాడు. అంతటితో ఆగలేదు. దానితోపాటు ఆ వ్యక్తి విషసర్పం నోటిని పట్టుకుని ఆస్పత్రికి వెళ్లాడు. దీంతో ఆయన చేతిలో విష సర్పంను చూసి ఆస్పత్రిలో జనం అటు ఇటు పరిగెత్తడం ప్రారంభించారు. పామును చూసిన వైద్యులు కూడా ఆయనకు చికిత్స చేసేందుకు నిరాకరించారు. చివరకు అతి కష్టం మీద పామును ఒక సంచిలో బంధించి, ఆ తర్వాత అతడికి చికిత్సను అందించారు. ఈ విచిత్ర సంఘటన బీహార్(Bihar)లోని భాగల్‌పూర్(Bhagalpur)లో వెలుగులోకి వచ్చింది.
చివరకు
ఆ వ్యక్తి పేరు ప్రకాష్ మండల్ కాగా, బరారి పంచాయతీ మీరాచక్ నివాసిగా గుర్తించారు. మంగళవారం రాత్రి ప్రమాదకరమైన రక్త పింజర పాము అతని ఎడమ చేతికి కాటేయగా, దాని నోటిని పట్టుకుని అతను జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని మెడిసిన్ ఎమర్జెన్సీ విభాగానికి చేరుకున్నాడు. ఆ క్రమంలో పామును అతని చేతిలో పట్టుకుని అక్కడక్కడ తిరుగుతూ కొంతసేపటి తర్వాత నేలపై పడుకున్నాడు. ఆ తర్వాత అతడిని ఆసుపత్రిలోని ఫ్యాబ్రికేటెడ్ వార్డుకు తరలించారు. ఆసుపత్రిలో జరిగిన ఈ మొత్తం తంతంగాన్ని అక్కడ ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కామెంట్లు
దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన అనేక మంది పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మీరు గ్రేట్ బ్రో అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా, జర జాగ్రత్త బ్రదర్ అని మరో వ్యక్తి అన్నారు. దాన్ని వదకూడదని ఇంకో వ్యక్తి అన్నారు. ప్రపంచంలోని ఐదు అత్యంత విషపూరిత సర్పాలలో రక్త పింజర కూడా ఒకటి కావడం విశేషం.
గతంలో
మరోవైపు భాగల్‌పూర్‌లో రక్త పింజర పాములు నిరంతరం దర్శనమిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఇలాంటి క్రమంలో భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలిపారు. గంగా తీరం వెంబడి ఉన్న ప్రాంతాల్లో పాములు నిత్యం దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకు వందలాది పాములను అటవీ శాఖ రక్షించింది. కొన్ని నెలల క్రితం 42 రక్త పింజర పాములు తిల్కా మాంఝీ భాగల్‌పూర్ విశ్వవిద్యాలయంలోని పీజీ బాలికల హాస్టల్‌లోని ట్యాంక్‌లో కనిపించాయి. వాటిని అటవీ శాఖ జాముయి అడవిలో విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా అలాంటి పాములు జనం ఉన్న ప్రాంతాల్లోకి రావడం కలకలం రేపుతోంది.
ఇవి కూడా చదవండి..
Ratan Tata: పీవీ నరసింహారావుకు రతన్ టాటా లేఖ.. ఆర్థిక సంస్కరణల గురించి ఏమన్నారంటే..
Optical Illusion: మీ ఐక్యూకు రియల్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న చిన్న తప్పును 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Oct 16 , 2024 | 06:23 PM