మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: అయ్య బాబోయ్..! ఇదేంటీ సోఫాలో కూర్చుంటే.. ఇలాక్కూడా జరుగుతుందా..

ABN, Publish Date - May 11 , 2024 | 08:53 PM

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అసాధ్యం అనుకున్న పనులను కూడా సుసాధ్యం చేసేస్తున్నారు. అయితే కొందరు ఈ టెక్నాలజీని తప్పుడు పనులకు వినియోగిస్తుంటే.. మరికొందరు ఎదుటి వారిపై పగ తీర్చుకోవడానికి, ఇంకొందరు ఆట పట్టించేందుకు వినియోగిస్తూ దుర్వినియోగం చేస్తుంటారు. ఇలాంటి ...

Viral Video: అయ్య బాబోయ్..! ఇదేంటీ సోఫాలో కూర్చుంటే.. ఇలాక్కూడా జరుగుతుందా..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అసాధ్యం అనుకున్న పనులను కూడా సుసాధ్యం చేసేస్తున్నారు. అయితే కొందరు ఈ టెక్నాలజీని తప్పుడు పనులకు వినియోగిస్తుంటే.. మరికొందరు ఎదుటి వారిపై పగ తీర్చుకోవడానికి, ఇంకొందరు ఆట పట్టించేందుకు వినియోగిస్తూ దుర్వినియోగం చేస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి సోఫాలో కూర్చుని స్నేహితులతో మాట్లాడుతుండగా.. సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొంత మంది స్నేహితులు సోఫాలో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇంతలో ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. వారిలో ఓ చివరన కూర్చున్న వ్యక్తి స్థలంలో (sofa Exploded) సోఫా ఒక్కసారిగా పేలిపోతుంది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా గాల్లోకి లేచి కొన్ని అడుగుల దూరంలో ఎగిరిపడతాడు. సోఫా పేలుడు శబ్ధానికి అంతా ఒక్కసారిగా భయంతో వణికిపోతారు.

Viral Video: లవ్ సింబల్ వెలుగులో ప్రేమికుల రొమాన్స్.. మధ్యలో ఎంటరై.. ఇతను చేసిన పని..


ఇదంతా వారు కావాలని ప్లాన్ చేసి స్నేహితుడిని ఆట పట్టించినట్లుగా తెలుస్తోంది. అయితే అతడు ఎగిరిపడిన విధానం చూస్తే.. తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియకున్నా.. ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రాంక్ పేరుతో అతడి ప్రాణాల మీదకు తెచ్చారే’’.. అంటూ కొందరు, ‘‘మీ దుంపలు తెగా.. మరీ ఇంత దారుణమైన ప్రాంక్ ఏంట్రా నాయనా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 54 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వేదిక పైనే మరదలితో కలిసి డాన్స్ చేసిన వరుడు.. ఓపిగ్గా చూసిన వధువు.. చివరకు..

Updated Date - May 11 , 2024 | 08:54 PM

Advertising
Advertising