ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral video: ఎంత ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం... ఇలా ఎవరైనా చేస్తారా.. ఈ బైకర్‌ను చూసి అంతా షాక్..

ABN, Publish Date - Jun 28 , 2024 | 04:42 PM

ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిన సందర్భాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో కొందరు ట్రాఫిక్ నుంచి బయటపడేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. మరికొందరు..

ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిన సందర్భాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో కొందరు ట్రాఫిక్ నుంచి బయటపడేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. మరికొందరు విధి లేని పరిస్థితుల్లో అలాగే ఉండిపోతుంటారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ బైకర్ చేసిన పనికి అంతా అవాక్కవుతున్నారు. ట్రాఫిక్ జామ్ అవడంతో ఓ బైకర్ చివరకు ఎలా ఎస్కేప్ అయ్యాడో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ కూడలిలో రెడ్ సిగ్నల్ పడడంతో వాహనాలు బారులుదీరాయి. చాలా సేపు ట్రాఫిక్ జామ్ (Traffic jam) అవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే ఇంతలో ఓ బైకర్ చేసిన పనిని అంతా షాక్ అయ్యారు. చాలా సేపు ఓపిగ్గా భరించిన బైకర్.. చివరకు ఓపిక నశించి ఎలాగైనా ట్రాఫిక్ నుంచి బయటపడాలని అనుకున్నాడు. ఇందుకోసం ఏకంగా (man carrying bike on his shoulder) తన బైకును పైకి ఎత్తి భుజంపై ఎత్తుకున్నాడు.

Viral video: వామ్మో..! పాకిస్థాన్‌లో ఇలా చేస్తారా.. కదులుతున్న రైలుపై ఆకతాయిలు నీళ్లు చల్లడంతో చివరకు ..


వాహనాల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్లాడు. బైకును భుజంపై ఎత్తుకుని వెళ్తున్న అతన్ని చూసి అంతా అవాక్కయ్యారు. బైకును భుజం పైకి ఎత్తుకుని చాలా దూరం మోసుకెళ్లాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతను రియల్ బాహుబలిలా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఐడియా ఏదో బాగుందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌‌లను సొంతం చేసుకుంది.

Viral video: మృతదేహాన్ని పక్కన పెట్టుకుని వీళ్లు చేస్తున్న పని చూస్తే.. నోరెళ్లబెడతారు..

Updated Date - Jun 28 , 2024 | 04:42 PM

Advertising
Advertising