Viral Video: అదేమైనా మంత్రదండమా.. రోడ్డును ఎలా క్రాస్ చేస్తున్నాడో చూస్తే అవాక్కవుతారు..
ABN, Publish Date - Nov 26 , 2024 | 12:08 PM
ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యం వల్లే జరుగుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని దేశాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల విధించే నిబంధనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇంకొన్ని ప్రాంతాల్లో నిబంధనలు చూస్తే.. ‘‘అరే ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ..
ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యం వల్లే జరుగుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని దేశాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల విధించే నిబంధనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇంకొన్ని ప్రాంతాల్లో నిబంధనలు చూస్తే.. ‘‘అరే ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి చిత్ర విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు.. ‘‘అదేమైనా మంత్రదండమా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రోడ్డు క్రాస్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. క్రాస్ చేసే ముందు అతను చేసిన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. రోడ్డు క్రాస్ చేయడానికి (Crossing the road) ముందు రోడ్డు పక్కన స్తంభం వద్దకు వెళ్లాడు. ఆ స్తంభానికి ఏర్పాటు చేసిన బోర్డుపై BE SEEN grab a brick అని రాసి ఉండడతో పాటూ 1.grab, 2.look, 3.wave, 4.cross అని రాసి ఉంది.
అదేవిధంగా ఆ బోర్డు కింద ఉన్న ట్రేలో చాలా ఇటుకలు ఉన్నాయి. వాటిలో ఓ ఇటుకను తీసుకుని రోడ్డుపై జీబ్రా లైన్స్‌పైకి వెళ్లాడు. అతడి చేతిలో ఇటుకను చూడగానే వాహనదారులు కూడా సడన్‌గా బ్రేకలు వేసి దూరంగా ఆపేశారు. ఇలా ఇటుకను చూపిస్తూ రోడ్డుకు ఇవతలి వైపు నుంచి (man crossing the road with brick in his hand) అవతలి వైపునకు దర్జాగా వెళ్లిపోయాడు. అలా రోడ్డు దాటిన తర్వాత ఆ ఇటుకను అక్కడి స్తంభానికి ఉన్న ట్రేలో పెట్టాడు. ఇలా ఇటుకతో రోడ్డు దాటిన వ్యక్తిని చూసి అంతా అవాక్కవుతున్నారు.
Viral Video: ఫారెస్ట్ గార్డ్‌కు ఎదురుపడ్డ పులి.. చాకచక్యంగా దాన్నుంచి ఎలా తప్పించుకున్నాడో చూస్తే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. ఈ ట్రిక్ బాగా పని చేసింది’’.. అంటూ కొందరు, ‘‘ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 వేలకు పైగా లైక్‌లు, 4.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఓరీ మీ దుంపలు తెగా.. రన్నింగ్ ఆటోలో ఈ పనులేంట్రా నాయనా.. చూశారంటే షాకవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
Viral Video: లగేజీ బ్యాగ్ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 26 , 2024 | 12:08 PM