ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కిడ్నాప్ చేసిన కారు నుంచి ఎలా తప్పించుకోవాలో.. సింపుల్ ట్రిక్‌తో చెప్పేశాడుగా..

ABN, Publish Date - Aug 07 , 2024 | 10:33 AM

ప్రస్తుత సమాజంలో మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. మాట వినని పక్షంలో కిడ్నాప్ చేసి వివిధ రకాలుగా బెదిరిస్తుంటారు. కార్లలో కిడ్నాప్ చేసే ఘటనలు ఇటీవల తరచూ చూస్తూ ఉన్నాం. అయితే...

ప్రస్తుత సమాజంలో మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. మాట వినని పక్షంలో కిడ్నాప్ చేసి వివిధ రకాలుగా బెదిరిస్తుంటారు. కార్లలో కిడ్నాప్ చేసే ఘటనలు ఇటీవల తరచూ చూస్తూ ఉన్నాం. అయితే ఇలా కారులో కిడ్నాప్ చేస్తే.. ఎలా తప్పించుకోవాలనే విషయంపై ఓ యువకుడు సింపుల్ ట్రిక్‌తో వివరించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సదరు యువకుడిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా మహిళలను ఎక్కువగా (Kidnapping in car) కార్లలోనే కిడ్నాప్ చేస్తుంటారు. చాలా మందిని కారు డిక్కీలో వేసుకుని తీసుకెళ్తున్న ఘటనల గురించి వింటుంటాం. అయితే ఇలాంటి సమయాల్లో కారు నుంచి ఎలా బయటపడాలనే విషయంపై ఓ యువకుడు సింపుల్‌గా వివరించాడు.

Viral Video: ఆకలేసిన ఏనుగు.. మొదటి అంతస్తులోని ఆహారాన్ని ఎలా కొట్టేసిందో చూస్తే..


ఆ యువకుడు కారు డిక్కీలో పడుకోగానే లాక్ చేస్తారు. అయితే ఆ తర్వాత అతను లోపల ఏం చేయాలనే విషయంపై వివరిస్తాడు. కారు డిక్కీ (Car Trunk) మూయగానే పైన చేతులు పెట్టి లాక్ కోసం వెతుకుతాడు. అయితే అతడికి డోరు అన్‌లాక్‌కు (Unlock the door) సంబంధించిన వైర్ కనపడుతుంది. దానిపై చేయి పెట్టి చివరి వరకూ తీసుకెళ్తాడు. చివరకు అక్కడ ఉన్న పిన్ లాంటి వస్తువును నొక్కగానే డోర్ ఆటోమేటిక్‌గా తెరుచుకుంటుంది.

Viral Video: రైల్లో టీసీ ప్రశ్నకు యువకుడి వింత సమాధానం.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు..


ఇలా సింపుల్ ట్రిక్‌తో కారులో నుంచి బయటపడొచ్చని వివరిస్తాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చాలా చక్కగా వివరించారు.. ఇది ఎంతో ఉపయోగపడుతుంది’’.. అంటూ కొందరు, ‘‘ఒకవేళ కారు మధ్యలోని సీట్లో బంధిస్తే.. ఎలా తప్పించుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 23 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: కాటేసినా పాముకు ప్రాణం పోశాడు.. చివరకు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా..

Updated Date - Aug 07 , 2024 | 10:33 AM

Advertising
Advertising
<