Viral Video: వామ్మో.. ఇలాంటి బైక్ స్టంట్ ఎక్కడైనా చూశారా.. మొత్తానికి పెద్ద షాకే ఇచ్చాడుగా..

ABN, Publish Date - Sep 17 , 2024 | 03:56 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బైకుపై విన్యాసం చేశాడు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా.. అతను చేసిన బైక్ రైడ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా ఎవరైనా రెండు టైర్లు ఉన్న బైకుతోనే విన్యాసాలు చేయడం చూస్తుంటాం. అయితే..

Viral Video: వామ్మో.. ఇలాంటి బైక్ స్టంట్ ఎక్కడైనా చూశారా.. మొత్తానికి పెద్ద షాకే ఇచ్చాడుగా..

కొందరు బైకులపై చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ఐదు, ఆరుగురిని ఎక్కించుకుని విచిత్రంగా డ్రైవ్ చేసే వారు కొందరైతే.. మరికొందరు ఎవరికీ సాధ్యం కాని విన్యాసాలను ఎంతో ఈజీగా చేసేస్తుంటారు. ఇంకొందరు స్పైడర్ మ్యాన్ తరహాలో బైకుకు వేలాడుతూ విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బైకు విన్యాసం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో.. ఇలాంటి బైక్ స్టంట్ ఎక్కడైనా చూశారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బైకుపై విన్యాసం చేశాడు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా.. అతను చేసిన బైక్ రైడ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా ఎవరైనా రెండు టైర్లు ఉన్న బైకుతోనే విన్యాసాలు చేయడం చూస్తుంటాం. అయితే ఇతను మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా కేవలం ఒక టైరు ఉన్న బైకుపై (Stunts with single tire bike) విన్యాసం చేయడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

Viral Video: పాములు ఇలాక్కూడా చేస్తాయా.. గొంతులో ఉబ్బెత్తుగా ఉండడంతో.. ఏంటా అని పరిశీలించగా..


ముందు టైరుతో పాటూ హ్యాండిల్ మొత్తాన్ని తీసేశారు. మిగతా భాగంతో పాటూ కేవలం వెనుక టైరు మాత్రమే ఉన్న బైకును నిలబెట్టడమే కష్టం. అలాంటిది ఇతను ఏకంగా దానిపై రైడ్ చేశాడు. అది కూడా సీటు వెనుక నిలబడి మరీ చాలా దూరం డ్రైవ్ చేశాడు. బైకు కిందపడిపోకుండా సీటు వెనుక నిలబడి బ్యాలెన్స్ చేస్తూనే.. మరోవైపు వాహనం అటూ, ఇటూ వెళ్లకుండా కంట్రోల్ చేస్తూ రైడ్ చేశాడు.

Viral Video: బాలుడు ఫోన్‌ బిజీలో ఉండగా.. చకచకా భుజంపైకి ఎక్కిన బల్లి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


ఈ విన్యాసం చూసేందుకు రెండు టైర్లు ఉన్న వాహనాన్ని డ్రైవ్ చేసినట్లే ఉంది. ఇలా కేవలం ఒక టైరుతో ఉన్న బైకును నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇలాంటి స్టంట్ చేయడం ఎలా సాధ్యం’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలు చేయడం చాలా ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి దారి తీయొచ్చు.. గణేశుడిని నిమజ్జనం చేస్తుండగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 17 , 2024 | 03:56 PM

Advertising
Advertising