Viral Video: ఇలాంటి కొళాయి.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్..
ABN, Publish Date - May 17 , 2024 | 09:48 PM
కొందరికి ఎవరికీ కాని చిత్రవిచిత్ర ఆలోచనలు వస్తుంటాయి. వాటికి మరింత పదును పెట్టి వారు చేసే ప్రయోగాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు..
కొందరికి ఎవరికీ కాని చిత్రవిచిత్ర ఆలోచనలు వస్తుంటాయి. వాటికి మరింత పదును పెట్టి వారు చేసే ప్రయోగాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కొళాయికి లాక్ వేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇలాంటి కొళాయి.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అన్నింటికీ తాళాలు ఉంటాయి.. మరి కొళాయికి ఎందుకు ఉండకూడదు.. అని అనుకున్నాడో ఏమో గానీ, ఓ వ్యక్తి ఏకంగా కొళాయికే లాక్ వేశాడు. ఆ కొళాయిని (Water tap) ఓపెన్ చేయాలంటే తాళం చెవి ఉండాల్సిందే. ఈ కొళాయిని ప్రత్యేకంగా తయారు చేశాడు. ఈ కొళాయి నుంచి నీళ్లు రావాలంటే ఖచ్చితంగా తాళం చెవి (key) ఉండాల్సిందే.
Viral Video: విదేశీ యువతికి షాకింగ్ అనుభవం.. జనాల మధ్యలో ఓ వ్యక్తి లాగి మరీ..
తాళం చెవిని కొళాయి టాప్‌లో పెట్టి తిప్పగానే నీళ్లు బయటికి వచ్చాయి. మళ్లీ ఆఫ్ చేయగానే ఆగిపోయాయి. చూసేందుకు అచ్చం తాళం చెవితో లాక్ చేసినట్లుగానే అనిపిస్తోంది. ఈ విచిత్ర కొళాయి వీడియోను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కొళాయి భలే ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1400 పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: కారు కడగడం ఓకే గానీ.. మరీ విచిత్రంగా.. నీళ్లు అలా పోయడం ఏంట్రా బాబోయ్..
Updated Date - May 17 , 2024 | 09:48 PM