మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: సమయంతో పాటూ విద్యుత్ బిల్లునూ సేవ్ చేశాడు.. ఇతడి ఇస్త్రీ ట్రిక్ మామూలుగా లేదుగా..

ABN, Publish Date - May 05 , 2024 | 09:21 PM

అంతా ఒకేలా చేసే పనులను.. కొందరు చిత్రవిచిత్రంగా చేసి చూపిస్తుంటారు. ఈ క్రమంలో ఇంకొందరు తమ తెలివితేటలకు పదునుపెట్టి సమయాన్ని, డబ్బును ఆదా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి...

Viral video: సమయంతో పాటూ విద్యుత్ బిల్లునూ సేవ్ చేశాడు.. ఇతడి ఇస్త్రీ ట్రిక్ మామూలుగా లేదుగా..

అంతా ఒకేలా చేసే పనులను.. కొందరు చిత్రవిచిత్రంగా చేసి చూపిస్తుంటారు. ఈ క్రమంలో ఇంకొందరు తమ తెలివితేటలకు పదునుపెట్టి సమయాన్ని, డబ్బును ఆదా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టిం తెగ చక్కర్లు కొడుతోంది. ఇస్త్రీ చేసే సమయంలో ఓ వ్యక్తి సమయంతో పాటూ విద్యుత్ బిల్లునూ సేవ్ చేసేందుకు విచిత్ర ప్రయోగం చేశాడు. ఇతడి తెలివితేటలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. దుస్తులను చిత్రవిచిత్రంగా ఇస్త్రీ చేసిన వాళ్లను గతంలో చాలా మందిని చూశాం. కొందరు వేడి నీటి చెంబుతో ఇస్త్రీ చేస్తే.. మరికొందరు ఇస్త్రీ బాక్స్‌ను పొయ్యిపై వేడి చేసి తద్వారా ఇస్త్రీ చేయడం చూశాం. తాజాగా, ఓ వ్యక్తి వినూత్నంగా ఇస్త్రీ చేశాడు. పొయ్యిపై కుక్కర్‌లో పప్పు ఉడుకుతుండగా.. ఓ వ్యక్తికి వినూత్న ఆలోచన వచ్చింది. తన చొక్కాను ఇస్త్రీ చేసేందుకు కుక్కర్‌ను ఎందుకు వాడకూడదు.. అని ఆలోచించాడు. ఆలోచన వచ్చిందే తడవుగా.. వంట గదిలో ఓ దుప్పటి పరిచేసి, దానిపై చొక్కాను ఉంచాడు.

Viral: పాల బాటిల్‌ను పక్కకు నెట్టేసిన చిన్నారి.. అనుమానం వచ్చి పరిశీలించిన బామ్మకు దిమ్మతిరిగే షాక్..


ఉడుకుతున్న కుక్కర్‌ను పట్టుకుని చొక్కాపై అటూ, ఇటూ తిప్పుతూ ఇస్త్రీ చేశాడు. ఇలా దఫ దఫాలుగా (Shirt iron with cooker) చొక్కాను నీట్‌గా ఇస్త్రీ చేశాడు. తద్వారా సమయంతో పాటూ కరెంట్ బిల్లునూ సేవ్ చేశాడన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఐడియా అదిరింది బ్రదర్’’.. అంటూ కొందరు, ‘‘ఇస్త్రీ ఇలాక్కూడా చేయొచ్చా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 73వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: ఇతనేంటీ..! బంగారం లాంటి బైకును ఇలా చేశాడు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

Updated Date - May 05 , 2024 | 09:21 PM

Advertising
Advertising