ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral video: సిమెంట్ మూటను ఇలా ఎవరైనా ఎత్తగలరా.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..

ABN, Publish Date - Jun 25 , 2024 | 08:20 PM

ఎవరికీ సాధ్యం కాని విధంగా పెద్ద పెద్ద బరువులను సునాయాసంగా ఎత్తేస్తూ కొందరు అందరినీ ఆకట్టుకుంటుటారు. ఇంకొందరు చేసే పనులు చూస్తే.. ఇంకెవరికీ సాధ్యం కాదేమో అని అనిపిస్తుంటుంది. ఇలాంటి..

ఎవరికీ సాధ్యం కాని విధంగా పెద్ద పెద్ద బరువులను సునాయాసంగా ఎత్తేస్తూ కొందరు అందరినీ ఆకట్టుకుంటుటారు. ఇంకొందరు చేసే పనులు చూస్తే.. ఇంకెవరికీ సాధ్యం కాదేమో అని అనిపిస్తుంటుంది. ఇలాంటి వినూత్న విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి సిమెంట్ మూటను ఎత్తిన విధానం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు సిమెంట్ బస్తాలు మోసే పనిలో ఉన్నాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. అతడు సిమెంట్ బస్తా మోసిన విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఓ సిమెంట్ బస్తాను తన ముందు ఉంచుకున్న అతను చివరకు దాన్ని (man lifted cement bag with his teeth) తన నోటితో గట్టిగా పట్టుకుంటాడు. ఏం చేస్తున్నాడని చూసే లోగానే సదరు యువకుడు ఆ బస్తాను తన నోటితో సులభంగా పైకి ఎత్తుకుంటాడు. అంతటితో ఆగకుండా వెనక్కు తిరిగి, మరో బస్తాను తన వీపుపై వేసుకుని గోడౌన్ బయటికి మోసుకొస్తాడు.

Viral video: పెళ్లి భోజనంలో కనిపించని చికెన్ లెగ్ పీస్.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


తర్వాత రెండు, మూడు రౌండ్లు గుండ్రంగా తిరిగి నోటితో పట్టుకున్న బస్తాను కిందపడేస్తాడు. మామూలుగా మోయడమే కష్టం అనుకుంటే.. ఇతనేమో ఏకంగా తన నోటితో బస్తాను మోయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి పండ్లు చాలా బలంగా ఉన్నాయని అర్థమైంది’’.. అంటూ కొందరు, ‘‘ఎంత శక్తి ఉంటే మాత్రం ఇలాంటి పనులు చేయడం ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: వివాహానికి ముందు వింత ఒప్పందం.. పెళ్లి తర్వాత కోరిక తీర్చలేకపోయిన భర్త.. చివరకు..

Updated Date - Jun 25 , 2024 | 08:32 PM

Advertising
Advertising