ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral video: వామ్మో..! ఇతను మనిషా.. లేక మరమనిషా.. ఆటో మోయాల్సిన మూటలను...

ABN, Publish Date - Jun 21 , 2024 | 09:14 PM

అంతా మనుషులే అయినా ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. కొందరైతే ఇతరులకు సాధ్యం కాని పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇంకొందరు చేసే పనులు చూస్తే.. అనితరసాధ్యం అని అనిపిస్తుంటుంది. ఇలాంటి..

అంతా మనుషులే అయినా ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. కొందరైతే ఇతరులకు సాధ్యం కాని పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇంకొందరు చేసే పనులు చూస్తే.. అనితరసాధ్యం అని అనిపిస్తుంటుంది. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మూటలు మోయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ఇతను మనిషా.. లేక మరమనిషా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చేసిన వినూత్న విన్యాసం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఓ వ్యక్తి తలపై మూటలు మోసుకుంటూ వస్తున్నాడు. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా.. అతను మోసింది ఒకటి, రెండు కాదు ఓ ఆటోలో (man lifted various sacks) మోయాల్సిన మూటలను ఒక్కడే మోసేశాడు. ముందుగా తన రెండు చేతుల మధ్యలో రెండు మూటలు పెట్టుకున్నాడు. తర్వాత తన తలపై రెండు మూటలను ఉంచి, దానిపై అడ్డంగా మరో రెండు.. ఇలా మొత్తం 8 వరుసలుగా మూటలను పేర్చేశారు.

Viral video: బస్సు కింద పడుకుని యువకుడు చేసిన స్టంట్‌పై.. సజ్జనార్ సీరియస్


ఆ మూటన్నింటినీ ఒక్కడే ఎంతో సులభంగా మోస్తున్నాడు. పైగా మూటలను ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా కంట్రోల్ చేస్తూ చాలా దూరం మోసుకెళ్లాడు. ఆ మూటలు ఎక్కువ బరువు లేనట్లు అనిపిస్తున్నా కూడా.. అన్ని మూటలను ఒక్క వ్యక్తి మోయడం, అది కూడా కిందపడకుండా మోయడం టాలెంట్ అనే చెప్పొచ్చు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలను ఎవరూ అనుకరించవద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: నీళ్లలో నడుస్తుండగా షాకింగ్ సీన్.. రాయిలా మెరుస్తూ ఉండడంతో కాలితో తొక్కి చూడగా..

Updated Date - Jun 21 , 2024 | 09:14 PM

Advertising
Advertising