Viral Video: ఈ షూలకు నూరేళ్ల వారెంటీ ఇవ్వొచ్చు.. ఎలా చేశాడో చూస్తే నోరెళ్లబెడతారు..
ABN, Publish Date - Nov 03 , 2024 | 12:11 PM
ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ వారి టాలెంట్‌కు పదునుపెట్టి వినూత్న ప్రయోగాలు చేయడం, వాటిని వీడియోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయడం సర్వసాధారణమైంది. వాటిలో కొన్ని వీడియోలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్ని వీడియోలు అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. కొందరు ..
ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ వారి టాలెంట్‌కు పదునుపెట్టి వినూత్న ప్రయోగాలు చేయడం, వాటిని వీడియోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయడం సర్వసాధారణమైంది. వాటిలో కొన్ని వీడియోలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్ని వీడియోలు అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. కొందరు ఎవరూ చేయని విధంగా ఏవోవే ప్రయోగాలు చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తయారు చేసిన షూలను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఈ ఫూలకు నూరేళ్ల వారెంటీ ఇవ్వొచ్చు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి అందరిలా కాకుండా వినూత్నమైన షూలను తయారు చేసి నెట్టింట వైరల్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం చివరకు తనకు వచ్చిన వెల్డింగ్ పనితోనే అద్భుతాన్ని సృష్టించాడు. ఇనుస ప్లేట్లను చూడగానే.. (man made shoe out of iron plates)వాటినే చెప్పుల తరహాలో ఎందుకు డిజైన్ చేయకూడదూ.. అని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలోకి దిగాడు.
Viral Video: తల్లిపై అలిగి బాక్సులో దాక్కున్న కొడుకు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ముందుగా ఓ పెద్ద ఇనుప ప్లేటును తీసుకుని తన కాలికి సరిపడే సైజులో కట్ చేశాడు. ఆ తర్వాత దానికి ముందు వైపు గుండ్రంగా ఉన్న చిన్న ఇనుప ముక్కను అతికించాడు. ఇలాంటి గుండ్రటి ఇనుప ముక్కలను సైజు పెంచుతూ ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ వచ్చాడు. దానికి వెనుక వైపు మడమకు సరిపడా మరో గుండ్రటి ఇనుప ముక్కను వెల్డింగ్ చేసేశాడు. ఇలా చివరకు దాన్ని అచ్చం షూ ఆకారంలో తయారు చేశాడు. దూరం నుంచి చూస్తే అచ్చం షూలాగే కనిపించే ఈ ఇనుప షూలను అంతా విచిత్రంగా చూస్తున్నారు.
Viral Video: టపాసులను ఇలాక్కూడా కాల్చొచ్చా.. టెక్నాలజీని ఎలా వాడుకున్నాడో చూడండి..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఈ షూలకు నూరేళ్ల వారెంటీ ఇవ్వొచ్చు’’.. అంటూ కొందరు, ‘‘ ఎన్నేళ్లయినా తెగిపోవు.. అప్పుడప్పుడూ పెయింట్ వేసుకుంటుంటే సరిపోతుంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లు, 8.8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
Viral Video: లగేజీ బ్యాగ్ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..
Viral Video: మేత పెట్టలేదని ఈ ఆవు చేసిన పని చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..
Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే అడవి జంతువులకు హడల్.. రైతు తెలివి మామూలుగా లేదుగా..
Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 03 , 2024 | 12:11 PM