ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. ఇలాంటి సీన్లు సినిమాల్లోనే చూస్తుంటాం.. బావిలో నుంచి కొండచిలువలను ఎలా బయటికి తీస్తున్నాడో చూడండి..

ABN, Publish Date - Oct 22 , 2024 | 07:20 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ... రెండు భారీ కొండచిలువలు ప్రమాదవశాత్తు ఓ బావిలో నుంచి బయటికి రాలేక కొట్టుమిట్టాడుతున్నాయి. బావిలో వింత శబ్ధాలను గమనించిన స్థానికులు అక్కడ గుమికూడారు. చివరకు అంతా కలిసి వాటిని రక్షించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో..

కొన్నిసార్లు కొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. సినిమా సీన్లు గుర్తుకొస్తుంటాయి. మరికొందరు చేసే పనులు సినిమా సీన్లను తలదన్నేలా ఉంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బావిలో నుంచి కొండచిలువలను బయటి తీయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ... రెండు భారీ కొండచిలువలు ప్రమాదవశాత్తు (Huge pythons in the well) ఓ బావిలో నుంచి బయటికి రాలేక కొట్టుమిట్టాడుతున్నాయి. బావిలో వింత శబ్ధాలను గమనించిన స్థానికులు అక్కడ గుమికూడారు. చివరకు అంతా కలిసి వాటిని రక్షించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో వారిలో ఓ వ్యక్తి బావిలోకి దిగి, నీటిలో మునిగిపోయిన కొండచిలువను వెతకడం స్టార్ట్ చేశాడు.

Viral Video: ఏనుగు ఖుషీ అయితే ఎలా ఉంటుందో తెలుసా.. అరటి గెలను చూసిన ఏనుగు.. చివరకు..


ఎలాగోలా ఓ భారీ కొండచిలువను వెతికి చేతిలోకి తీసుకున్నాడు. చివరకు దాన్ని అతి కష్టం మీద నీటి పైకి తెచ్చి, బావి పైన ఉన్న వారికి అందించాడు. అయితే కొండచిలువ భారీగా ఉండడంతో బయటికి తీయడం కష్టతరమైంది. ఎలాగోలా బయటికి లాగే ప్రయత్నం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు మధ్యలో మళ్లీ నీటిలో పడిపోయింది. దీంతో నీటిలో ఉన్న వ్యక్తి మళ్లీ ఎలాగోలా కొండచిలువను వారికి అందించాడు. ఇలా దాన్ని బయటికి తీసి ఒడ్డున పడేశారు.

Puzzle: ఏ గ్లాసులో నీరు ఎక్కువ ఉందో 25 సెకన్లలో చెప్పగలిగితే.. మీలో ఐక్యూ పవర్ ఎక్కువ ఉన్నట్లే..


ఆ తర్వాత నీటిలో ఉన్న మరో కొండచిలువను కూడా ఇలాగే బయటికి తీసేందుకు ప్రయత్నించాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ సీన్ చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘వీళ్లు చాలా గొప్ప పని చేశారు.. నిజంగా గ్రేట్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 వేలకు పైగా లైక్‌లు, 2.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈగలకు తెలీకుండా తేనె చోరీ.. ఇతడి టెక్నిక్ ఏంటో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 22 , 2024 | 07:22 AM