Share News

Viral Video: మొసలి నోట్లో చెయ్యి పెట్టాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Sep 30 , 2024 | 04:58 PM

దుష్టులకే కాదు. క్రూర మృగాలకు సైతం సాధ్యమైనంత దూరంగా ఉండాలి. అలా కాకుంటే.. వాళ్లతో.. వాటితో ఆటలాడితే చివరకు ప్రాణాలకే ప్రమాదమన్న సంగతి గ్రహించాలి. ఈ విషయాన్ని ఏ మాత్రం లైట్‌గా తీసుకున్నా.. ఆ తర్వాత ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకు ఇండోనేషియాలోని పట్టాయాలో చోటు చేసుకున్న ఈ ఘటనే అందుకు ఉదాహరణ. నీటి ఒడ్డుకు వచ్చిన మొసలి తలపై ఓ యువకుడు చెయ్యి పెట్టాడు.

Viral Video: మొసలి నోట్లో చెయ్యి పెట్టాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

దుష్టులకే కాదు. క్రూర మృగాలకు సైతం సాధ్యమైనంత దూరంగా ఉండాలి. అలా కాకుంటే.. వాళ్లతో.. వాటితో ఆటలాడితే చివరకు ప్రాణాలకే ప్రమాదమన్న సంగతి గ్రహించాలి. ఈ విషయాన్ని ఏ మాత్రం లైట్‌గా తీసుకున్నా.. ఆ తర్వాత ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకు ఇండోనేషియాలోని పట్టాయాలో చోటు చేసుకున్న ఈ ఘటనే అందుకు ఉదాహరణ. నీటి ఒడ్డుకు వచ్చిన మొసలి తలపై ఓ యువకుడు చెయ్యి పెట్టాడు.

Also Read: Mahalaya Amavasya 2024: మహాలయ అమావాస్య రోజు.. జస్ట్ ఇలా చేయండి చాలు..

Also Read: Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..


మొసలి మాత్రం ఏ మాత్రం స్పందించలేదు. దీంతో తన చెయ్యిని మొసలి నోట్లో పెట్టాడు. అంతే ఒక్కసారిగా మొసలి.. తన నోటీతో అతడి చేతిని పట్టుకుని నీటోలోకి లాగేందుకు ప్రయత్నించింది. అంతలోనే మొసలి నోటిని తెరవడం.. అతడు చేతిని వెనక్కి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి.

Also Read: Web Story: గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలి పెట్టరు

Also Read: Tirumala: కోనేటి రాయుడి సేవలో ఒకరోజు.. టికెట్ ఎంతంటే..


ఇంతలో మొసలి నీటిలోకి వెళ్లిపోయింది. ఆ యువకుడు సైతం తన చేతికైన గాయాలు చూసుకుంటూ అక్కడి నుంచి వెను తిరిగాడు. ఆ యువకుడి చేతికి అయిన గాయం నుంచి కారిన రక్తపు చుక్కలు ఆ ప్రదేశంలో పడ్డాయి. ఆ యువకుడే కాదు.. అక్కడున్న వారు ఎవరు ఊహించని ఈ ఘటనతో వారంతా ఒక్కసారిగా బిగ్ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన ది మిలియన్ ఇయర్స్ స్టోన్ పార్క్ అండ్ పట్టాయా క్రోకోడైల్ ఫామ్‌లో ఇటీవల చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


ఇప్పటి వరకు ఈ వీడియోను 4.2 మిలియన్ల మంది వీక్షించారు. 7,42,000 మంది ఈ వీడియోకు లైక్ కొట్టారు. అంతేకాదు.. వీడియోను వీక్షించిన నెటిజన్లు సైతం తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. జంతువుల బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకోకుండా.. వాటితో ఆటలాడవద్దని ఓ నెటిజన్ సూచించాడు. మొసలిలో ఆటలాడదామని వెళ్లి.. బోల్తా పడ్డాడంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.

Also Read: ముందుగా టికెట్ బుక్ చేయకున్నా.. తిరుమల వెంకన్నను ఇలా ఈజీగా దర్శించుకోవచ్చు.. ఎలాగంటే..?


నాతో ఆటలాడ వద్దని ఆ అబ్బాయికి మొసలి హెచ్చరించిందని ఇంకో నెటిజన్ వ్యాఖ్యానించాడు. ఈ ఘటన నుంచి ఆ యువకుడు పాఠం నేర్చుకున్నాడంటూ మరో నెటిజన్ స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఎంత వేగంగా వైలర్ అవుతుందో.. అదే స్పీడ్‌లో నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.


పశ్చిమ ఇండోనేషియాలో బుధవారం నదిలో ఓ మహిళ స్నానానికి దిగింది. ఆ మహిళని మొసలి చంపివేసింది. అనంతరం స్థానికులు గ్రామస్తులు ఆ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఇండినేషియాలో విభిన్న రకాల మొసళ్లున్నాయి. నీటిలో దిగిన వారిపై తరచూ ఇవి దాడి చేసి చంపేస్తుంటాయని స్థానికులు వెల్లడించారు.

మరిన్నీ వైరల్ వీడియో ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 30 , 2024 | 05:05 PM