Viral Video: అవి చేతులా లేక రబ్బరు పైపులా.. ఇతడు చేస్తున్న విన్యాసం చూస్తే..

ABN, Publish Date - Aug 13 , 2024 | 04:07 PM

అంతా మనుషులే అయినా కొందరు మాత్రం మిగతా వారికి భిన్నంగా ఉంటారు. అంతా చేయలేని పనులను ఇలాంటి వారు ఎంతో సింపుల్‌గా చేసేస్తుంటారు. అనితరసాధ్యం అనుకునే పనులను కూడా వీరు ఎంతో సులభంగా చేస్తుంటారు. ఇలాంటి...

Viral Video: అవి చేతులా లేక రబ్బరు పైపులా.. ఇతడు చేస్తున్న విన్యాసం చూస్తే..

అంతా మనుషులే అయినా కొందరు మాత్రం మిగతా వారికి భిన్నంగా ఉంటారు. అంతా చేయలేని పనులను ఇలాంటి వారు ఎంతో సింపుల్‌గా చేసేస్తుంటారు. అనితరసాధ్యం అనుకునే పనులను కూడా వీరు ఎంతో సులభంగా చేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘అవి చేతులా.. లేక.. రబ్బరు పైపులా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఇతను చేసిన విన్యాసం ఏంటో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వినూత్న విన్యాసం చేసేందుకు సిద్ధమయ్యాడు. చేతులు పైకి పెట్టుకుని నిల్చున్న అతను ఓ చేతిని పూర్తిగా తిప్పేశాడు. ఎలాగైనా రోబో తన చేతిని 360 డిగ్రీల కోణంలో (man turns his hand round) తిప్పగలతో అచ్చం అలాగే ఇతను కూడా తన చేయిని తిప్పాడు. ఓ చేతిని మరో చేత్తో పట్టుకుని అటూ ఇటూ గుండ్రంగా తిప్పి, చివరకు మళ్లీ యథావిధిగా సెట్ చేశాడు.

Viral Video: ఇది కదా అసలైన హోమ్ డెలివరీ అంటే.. వీళ్లు చేస్తున్న పని చూస్తే.. అవాక్కవడం ఖాయం..


ఈ విన్యాసం చూస్తే.. అవి చేతులా.. లేక రబ్బరు పైపులా అని అనిపించకమానదు. అంతలా ఆ వ్యక్తి తన చేతిని రౌండ్లు రౌండ్లుగా తిప్పేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడు మనిషా లేక రోబోనా’’.., ‘‘జన్యుపరగా ఇలా జరగొచ్చు.. కొన్నిసార్లు ఇది కీళ్ల నొప్పులకు దారి తీయొచ్చు’’.., ‘‘మానవ శీరరం మిస్టరీతో కూడుకున్నది’’.., ‘‘వామ్మో.. ఇలాంటి విన్యాసం ఎప్పుడూ చూడలేదు’’.., ‘‘చూస్తుంటే చేతి ఎముక పూర్తిగా విడిపోయినట్లుగా ఉందే’’.., ‘‘ఇలా చేయడం వల్ల భవిష్యత్‌లో సమస్యలు రావొచ్చు’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.90లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: హాయిగా పడుకుందామని వెళ్లాడు.. మంచం కింద నుంచి శబ్ధాలు రావడంతో.. పరుపు తీసి చూడగా..

Updated Date - Aug 13 , 2024 | 04:07 PM

Advertising
Advertising
<