ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: దేవుడు మనిషి రూపంలో రావడం అంటే ఇదేనేమో.. సమయానికి వచ్చి ఎలా కాపాడాడో చూస్తే..

ABN, Publish Date - Sep 13 , 2024 | 08:09 PM

కష్టాల్లో ఉన్నా వారిని కాపాడేందుకు దేవుడు మనిషి రూపంలో వస్తాడు.. అని పురాణాల్లో వింటూ ఉంటాం. అయితే కొన్నిసార్లు మన కళ్ల ముందు చోటు చేసుకునే ఘటనలు చూసినప్పుడు ఇలాంటి మాటలు నిజమేమో అని అనిపిస్తుంటుంది. కొందరు అనూహ్య ప్రమాదాల్లో చిక్కుకుని ప్రాణాలు పోయే సమయంలో ఎవరో ఒకరు వచ్చి..

కష్టాల్లో ఉన్నా వారిని కాపాడేందుకు దేవుడు మనిషి రూపంలో వస్తాడు.. అని పురాణాల్లో వింటూ ఉంటాం. అయితే కొన్నిసార్లు మన కళ్ల ముందు చోటు చేసుకునే ఘటనలు చూసినప్పుడు ఇలాంటి మాటలు నిజమేమో అని అనిపిస్తుంటుంది. కొందరు అనూహ్య ప్రమాదాల్లో చిక్కుకుని ప్రాణాలు పోయే సమయంలో ఎవరో ఒకరు వచ్చి వారిని కాపాడటం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ ఊహించని ప్రమాదంలో చిక్కుకుని విల్లవిల్లాడుతుంటుంది. ప్రాణాలు పోతాయేమో అనుకున్న సమయంలో ఉన్నట్టుండి ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ దుకాణంలో పని చేస్తున్న మహిళ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఇంతలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. దుకాణంలో మోటారుకు అమర్చిన బ్లేడు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో లోపల ఉన్న మహిళ (woman) మోటారుకు గోడకు మధ్య ఉన్న ఖాళీ స్థలం నుంచి ఇవతలికి వచ్చే ప్రయత్నం చేస్తుంది.

Viral Video: పెట్రోల్ బంక్‌‌లోకి వచ్చిన సింహం.. చివరకు ఏం జరిగిందో చూడండి..


అయితే మధ్యలో ప్రమాదవశాత్తు ఆమె దుస్తులు మోటారు బ్లేడులో (Motor blade) ఇరుక్కుంటాయి. దీంతో ఆ ఫ్యాన్‌తో ఆమె కూడా కింద నుంచి పైకి తిరిగి ధబేల్‌మని కింద పడిపోతుంది. దుస్తులు పూర్తిగా లాక్కోవడంతో ఆమె బ్లేడుకు అతుక్కపోతుంది. నేలసై పడి గిలాగిలా కొట్టుకుంటున్న తరుణంలో అక్కడే ఉన్న వ్యక్తి గమనించి పరుగు పరుగున అక్కడికి వస్తాడు. చివరకు మోటారు స్విచ్ ఆఫ్ చేసి, ఆమెను అతి కష్టం మీద పక్కకు తప్పిస్తాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది.

Viral Video: చుట్టుముట్టిన సింహాలతో జిరాఫీ పోరాటం.. చూస్తుండగానే అంతెత్తుకు జంప్ చేసిన సింహాలు.. చివరకు..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘సమయానికి దేవుడిలా వచ్చి కాపాడాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాంటి సైకిల్ ఎక్కడైనా చూశారా.. కొనేందుకు డబ్బులు లేక.. చివరకు ఎలా తయారు చేశాడో తెలిస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 13 , 2024 | 08:09 PM

Advertising
Advertising