ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇతడి చేతిలో మంత్రం ఉందా.. మొసళ్లన్నీ భయంతో ఎలా పారిపోతున్నాయో చూడండి..

ABN, Publish Date - Aug 25 , 2024 | 04:24 PM

మొసళ్లకు వేటాడి వేటాడి చంపడమే తప్ప భయంతో పారిపోవడం అనేది తెలీదు. ఎంత పెద్ద జంతువునైనా ఇట్టే నీటిలోకి లాగేసి చంపేయగలదు. మరి అలాంటి భయంకరమైన మొసలి భయపడితే ఎలా ఉంటుంది. అందులోనూ ఏకంగా పదుల సంఖ్యలో...

మొసళ్లకు వేటాడి వేటాడి చంపడమే తప్ప భయంతో పారిపోవడం అనేది తెలీదు. ఎంత పెద్ద జంతువునైనా ఇట్టే నీటిలోకి లాగేసి చంపేయగలదు. మరి అలాంటి భయంకరమైన మొసలి భయపడితే ఎలా ఉంటుంది. అందులోనూ ఏకంగా పదుల సంఖ్యలో మొసళ్లు ఒక్క వ్యక్తిని చూసి భయంతో పారిపోతే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చేతిలో గడ్డపార పట్టుకుని రావడం చూసి మొసళ్లన్నీ భయంతో పారిపోయి నీటిలోకి దూకుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధరణంగా గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలను తోలుకెళ్లే సమయంలో కర్రతో బెదిరిస్తే భయంతో చెప్పినట్లు వినడం చూస్తుంటాం. కానీ ఇదే పని మొసళ్ల వద్ద కూడా చేస్తామంటే కుదరదు అని అనుకుంటాం. కానీ ఓ వ్యక్తి మొసళ్ల వద్ద కూడా ఇలాగే చేశాడు. చేయడమే కాకుండా ఏకంగా మొసళ్లన్నీ (man scared away crocodiles with shovel) భయంతో పారిపోయేలా చేశాడు.

Viral Video: జలాకాలాటల్లో స్నేహితులు.. వెనుకే పడగవిప్పిన నాగుపాము.. చివరకు..


ఓ నీళ్ల కుంటలో ఉన్న మొసళ్లన్నీ ఒడ్డు మీదకు వచ్చి పడుకున్నాయి. అదే సమయంలో ఓ వ్యక్తి తన చేతిలో పొడవాటి ఇనుప గడ్డ పారను తీసుకుని వచ్చాడు. వేగంగా వస్తున్న అతన్ని చూసి ఒడ్డున ఉన్న మొసళ్లన్నీ భయంతో ఒక్కొక్కటిగా నీళ్లలోకి దూకేశాయి. ఆ వ్యక్తి అలా గడ్డ పార తీసుకుని మొసళ్లను హెచ్చరిస్తూ వేగంగా వెళ్తున్నాడు. అతను దగ్గరికి వచ్చేలోపే అక్కడ పడుకుని ఉన్న మొసళ్లన్నీ నీళ్లలోకి దూకేయడం వీడియోలో చూడొచ్చు. చివరగా ఓ మొసలి మాత్రం అతను దగ్గరికి వచ్చినా అలాగే ఉంటుంది.

Viral Video: ప్రాణం పోయే ముందు ప్రతాపం చూపించిన రొయ్య.. ఈ యువతికి ఏమైందో చూస్తే..


దీంతో ఆ మొసలి సమీపానికి వెళ్లిన అతను.. ‘‘నీకు ప్రత్యేకంగా చెప్పాలా.. నీళ్లలోకి వెళ్తావా.. చావకొట్టమంటావా’’.. అన్నట్లుగా దాని తల మీద గడ్డ పారతో ఒక్క దెబ్బ వేస్తాడు. దీంతో ఆ మొసలి కూడా ధబేల్‌మని నీటిలోకి దూకేస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘వామ్మో.. ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘మొసళ్లను ఇలా కంట్రోల్ చేయడం ఎక్కడా చూడలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 49 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 25 , 2024 | 04:24 PM

Advertising
Advertising
<