ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: టీ తాగడం మరీ ఇంత కష్టమా.. వీళ్లు పడ్డ శ్రమ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN, Publish Date - May 06 , 2024 | 04:55 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో విచిత్ర ప్రయోగాలు చేసే వారి వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. కొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. టీ తాగడం కోసం ఇద్దరు వ్యక్తులు పడ్డ కష్టం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

కొందరు తమకు ఇష్టమైన వాటిని దక్కించుకునే విషయంలో అస్సలు రాజీ పడరు. ఈ క్రమంలో ఎంతటి సాహసాలు చేయడానికైనా వెనుకాడరు. ఇందుకు నిదర్శనంగా సోషల్ సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి టీ తాగేందుకు చేసిన సాహసం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘టీ తాగడం కూడా మరీ ఇంత కష్టమా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. భవన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి అర్జంట్‌గా టీ తాగాలని కోరిక పుట్టింది. అయితే అతను ఎత్తైన బిల్డింగ్‌పై పని చేస్తుండడం, దిగి వెళ్లే తీరిక లేకపోవడంతో వీలు కాలేదు. అయినా ఎలాగైనా టీ తాగాలని అనుకున్నాడు. ఈ క్రమంలో కింద ఉన్న వ్యక్తిని టీ తీసుకురమ్మని చెప్పాడు. టీ తీసుకొచ్చిన అతను పైనున్న వ్యక్తికి ఎలా అందించాలన్న విషయంలో ఆలోచించాడు. మెట్లపై నుంచి వెళ్లకుండానే నేరుగా అతడికి ఇవ్వాలని అనుకున్నాడు.

Viral video: సమయంతో పాటూ విద్యుత్ బిల్లునూ సేవ్ చేశాడు.. ఇతడి ఇస్త్రీ ట్రిక్ మామూలుగా లేదుగా..


భవనం పైన ఉన్న వ్యక్తికి టీని అందించేందుుకు ఓ పొడవాటి కర్ర తీసుకుని, దానిపై వేడి వేడి టీ కప్పును ఉంచాడు. కర్రను బ్యాలెన్స్ చేస్తూ పైన ఉన్న వ్యక్తికి మెల్లగా అందించాడు. పైన ఉన్న వ్యక్తి టీని అందుకుని.. ‘‘హమ్మయ్య..! నా కోరిక తీరింది’’.. అనుకుంటూ టీని గుటగుటా తాగేస్తాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా.. మొఖం కాలిపోద్ది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: పొలాల్లోకి వెళ్లిన పెళ్లికొడుకు.. చివరకు అతిథులకు ఎలాంటి షాక్ ఇచ్చాడో చూస్తే..

Updated Date - May 06 , 2024 | 04:55 PM

Advertising
Advertising