Viral Video: ఇలాంటి తెలివితేటలు ఇతడికే సాధ్యం.. చలి తగలకుండా మంచం కింద ఇలా ఎవరైనా చేస్తారా..
ABN, Publish Date - Dec 11 , 2024 | 09:44 AM
‘‘ఊరందరిదీ ఒక దారి అయితే.. ఉలిపికట్టెది ఒక దారి’’.. అన్న సామెత చందంగా కొందరు మిగతా వారికి భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు సమస్యల పరిష్కారానికి వినూత్న మార్గాలను అన్వేషిస్తుంటారు. ఈ క్రమంలో వారు చేసే ప్రయోగాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ..
‘‘ఊరందరిదీ ఒక దారి అయితే.. ఉలిపికట్టెది ఒక దారి’’.. అన్న సామెత చందంగా కొందరు మిగతా వారికి భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు సమస్యల పరిష్కారానికి వినూత్న మార్గాలను అన్వేషిస్తుంటారు. ఈ క్రమంలో వారు చేసే ప్రయోగాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చలి తగలకుండా ఓ వ్యక్తి చేసిన ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇలాంటి తెలివితేటలు ఇతడికే సాధ్యం’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం చలి (cold) విపరీతంగా ఉండడంతో చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు తమ గదుల్లో హీటర్లు వాడుతుండగా.. మరికొందరు స్వెట్లర్లు వాడడం సర్వసాధారణం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి.. చలి తగలకుండా వినూత్న ఏర్పాట్లు చేసుకున్నాడు.
Viral Video: వామ్మో.. ఇలాక్కూడా జరుగుతుందా.. మహిళ నడుస్తూ వెళ్తుండగా ఫుట్‌పాత్‌పై పేలుడు.. చివరకు..
మంచంపై పడుకునే ముందు దాని కింద (man set fire under the bed) నిప్పుల కుంపటి పెట్టాడు. అది కూడా మండుతున్న కుంపటిని మంచం కింద పెట్టేసి, దుప్పటి కప్పుకొని తాపీగా నిద్రపోయాడు. చలి నుంచి బయటపడేందుకు ఇతడు చేసుకున్న ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: ఇది మామూలు ట్రైనింగ్ కాదురా బాబోయ్.. ఆమె ఇలా చెప్పగానే.. పావురం చేసిన పని చూడండి..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆహా.. ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘చలి తగలడం ఏమో గానీ.. మంచం కాలడం మాత్రం గ్యారెంటీ’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: మొసళ్లు ఎంత డేంజరో తెలుసా.. నీళ్లు తాగడానికి వెళ్లిన పందిని ఎలా పట్టుకున్నాయో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 11 , 2024 | 09:44 AM