ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇలాక్కూడా సిగ్నల్ ఇవ్వొచ్చా.. ఇండికేటర్ పాడవడంతో ఇతడు చేసిన నిర్వాకం చూడండి..

ABN, Publish Date - Aug 09 , 2024 | 01:45 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తున్నాడు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా.. అతడు వాహనాన్ని తోలిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. స్కూటీపై వెళ్లే సమయంలో...

వాహనదారులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు సిగ్నల్ జంపింగ్ చేస్తూ సీసీ కెమెరాలకు దొరికిపోతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి స్కూటీ నడిపే విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇలాక్కూడా సిగ్నల్ ఇవ్వొచ్చా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తున్నాడు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా.. అతడు వాహనాన్ని తోలిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. స్కూటీపై (Scooty) వెళ్లే సమయంలో అతను ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules) అన్నీ పాటించాడు. హెల్మెట్ కూడా ధరించాడు.

Viral Video: ఫుల్‌గా మందు కొట్టి రైలు పట్టాలపై పడుకున్న వ్యక్తి.. వేకువజాము పోలీసులు వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్..


అయితే తీరా మలుపు తిరిగే సమయంలో ఇండికేటర్ (Scooty indicator) వేద్దామనుకుంటే పని చేయలేదు. అయినా సరే ఎలాగైనా రూల్స్ తప్పకూడదు.. అని అనుకున్నాడో ఏమో గానీ చివరకు వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. మలుపు రాగానే ఒక కాలు పైకి లేపి ఎడమవైపు చూపించాడు. ఆ తర్వాత స్కూటీని ఎడమవైపు మళ్లించాడు. సాధారణంగా మలుపు తిరిగే సమయంలో ఇండికేటర్ పని చేయని పక్షంలో ఎవరైనా చేయిని చూపిస్తారు.

Viral Video: తాగుడుకు బానిసైతే పరిస్థితి ఇలా ఉంటుందా.. ఇతడు చేసిన నిర్వాకం చూడండి..


అయితే ఇతడు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా కాలును పైకి లేపడంతో అంతా అవాక్కవుతున్నారు. స్కూటీకి వెనుక వైపు వెళ్తున్న కొందరు ఇతన్ని చూసి వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాక్కూడా సిగ్నల్ ఇవ్వొచ్చా’’.. అంటూ కొందరు, ‘‘ఇండియాలో ఇలాంటి తెలివితేటలకు కొదవే లేదు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఉపాధ్యాయుడి కండీషన్ విని ఖంగుతిన్న మహిళా టీచర్.. హాజరు వేస్తానంటూ గదిలోకి పిలిచి..

Updated Date - Aug 09 , 2024 | 01:45 PM

Advertising
Advertising
<