ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: యువకుడికి షాక్! పెళ్లికోసమై వలలో పడి.. రూ.55 లక్షల నష్టపోయి..

ABN, Publish Date - Dec 20 , 2024 | 10:17 PM

ఆన్‌లైన్ ప్రేమల్లో చీకటి కోణం స్పష్టంగా చూపెట్టే మరో షాకింగ్ ఘటన చైనాలో వెలుగు చూసింది. సోషల్ మీడియాలో యువతితో పరిచయం ఓ యువకుడికి భారీ నష్టాన్ని మిగిల్చింది.

ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్ ప్రేమల్లో చీకటి కోణం స్పష్టంగా చూపెట్టే మరో షాకింగ్ ఘటన చైనాలో వెలుగు చూసింది. సోషల్ మీడియాలో యువతితో పరిచయం ఓ యువకుడికి భారీ నష్టాన్ని మిగిల్చింది. ఏకంగా రూ.55 లక్షల మేర జేబుకు చిల్లుపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే (Viral)..

Viral: ప్రియురాలి ఎఫైర్‌తో మనోవేదన! బాధితుడికి రూ.35 లక్షల పరిహారం!

హూబే ప్రావిన్స్‌కు చెందిన షిన్ అనే వ్యక్తి వెడింగ్ ప్లానర్ అడ్వర్‌టైజ్‌మెంట్స్ చూస్తుండగా షాయూ అనే మహిళ పరిచయమైంది. ఆన్‌లైన్ ఇద్దరూ తరచూ చాట్ చేసుకోవడం ప్రారంభించారు. చివరకు షిన్ షాయూతో ప్రేమలో పడ్డాడు. ఆమె ఓకే చెప్పడంతో మురిసిపోయాడు. అప్పటికే షాయూ తన కుటుంబంతో కలిసి పక్కాగా ప్లాన్ చేసుకుని అతడిని మెల్లమెల్లగా ముగ్గులోకి దింపడం ప్రారంభించింది.


మొదట అతడితో పెళ్లికి అంగీకరించిన ఆమె కన్యాశుల్కం కింద రూ.22 లక్షలు పంపించాలని కోరింది. తన కుటుంబంలో అది తరతరాలుగా సాగుతున్న సంప్రదాయమని చెప్పింది. అతడు ఇందుకు అంగీకరించి ఆ డబ్బును పంపించాడు. ఆ తరువాత తన చెల్లెలికి అదనపు బహుమతులు, తల్లి వైద్య ఖర్చుల పేరిట మరింత కొంత డబ్బు వసూలు చేసింది. అతడికి డౌట్ మొదలవడంతో ఆమె తన ఫొటోలు కూడా పంపించింది. ఫోన్లో మాట్లాడుతూ అతడిని మభ్య పెట్టి దాదాపు రూ.55 లక్షలు దండుకుంది.

Viral: ద్రవ్యోల్బణం పీక్స్‌కెళ్లడం అంటే ఇదీ! కప్పు కాఫీ ధర ఎంతో తెలిస్తే..


ఈ క్రమంలో షిన్ పట్టుబట్టంతో షాయూ తన కుటుంబాన్ని పరిచయం చేసేందుకు అంగీకరించింది. ఆ తరువాత వారిద్దరి కుటుంబసభ్యులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఆ సమయంలోనే షాయూను తొలిసారి చూసిన అతడు షాకైపోయాడు. తనకు పంపిన ఫొటోలకు, వాస్తవంలో ఆమె రూపురేఖలకు పొంతన లేకపోవడంతో షాకైపోయాడు. కానీ ఫొటోల్లో తాను ఫిల్టర్‌లు వాడానని ఆమె చెప్పడంతో అతడు సరేలే అనుకుని సర్దుకుపోయాడు. పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ క్రమంలో ఓసారి ఆమె సెల్‌ఫోన్‌లో అనుమానాస్పద సందేశాలు కనిపించడంతో షిన్ షాయూను నిలదీశాడు. తన ఫోన్ హ్యాకైందని కట్టుకథ చెప్పి తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నించింది.

ఈలోపు షాయూ చెల్లెలని చెప్పుకుంటూ ఓ యువతి రంగంలోకి దిగి తన సోదరితో బంధానికి ముగింపు పలకాలని షిన్‌ను కోరింది. దీంతో, అసలు ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు అతడు కూపీ లాగగా అసలు డొంక బయటపడింది. షాయూకు సోదరినని చెప్పుకుంటున్న మహిళే ఈ స్కామ్‌కు తెరలేపింది. డబ్బులిచ్చి నటీనటుల్ని రప్పించి కుటుంబసభ్యుల్లా పరిచయం చేసి ఆట రక్తికట్టించిందని తెలిసి అతడు షాక్ తిన్నాడు. వాస్తవానికి ఆమెకు పెళ్లై ఓ పిల్లాడు కూడా ఉన్నాడని, బిడ్డను సాకేందుకు ఆమె ఇలాంటి మోసాలకు తెరతీసిందని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగల ముఠాను అరెస్టు చేసేందుకు రంగంలోకి దిగారు.

Viral: వామ్మో.. మిల్క్ ప్యాకెట్స్‌పై ఎక్స్‌పైరీ డేట్ వెనక ఇంత స్టోరీ ఉందా!

Read Latest and Viral News

Updated Date - Dec 20 , 2024 | 10:21 PM