మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: పెళ్లంటే దోమల మంద అనుకున్నాడో ఏమో గానీ.. మంటపంలో ఈ వ్యక్తి చేసిన పనికి..

ABN, Publish Date - May 19 , 2024 | 08:14 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కల్యాణ మంటపంలో వివాహ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. అయితే ఇంతలో ఓ వ్యక్తి లోపలికి రావడంతో ఆహ్లాదకర వాతావరణం కాస్తా గందరగోళంగా మారిపోతుంది..

Viral Video: పెళ్లంటే దోమల మంద అనుకున్నాడో ఏమో గానీ.. మంటపంలో ఈ వ్యక్తి చేసిన పనికి..

కొందరు తెలిసీతెలియ చేసే పనులు.. ఎదుటివారిని ఇబ్బందుల్లో పడేస్తుంటాయి. ఇలాంటి పనులు కొన్నిసార్లు అందరికీ కోపం తెప్పిస్తుంటాయి. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పెళ్లి మంటపంలో చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘పెళ్లంటే దోమల మంద అనుకున్నాడేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కల్యాణ మంటపంలో వివాహ (marriage) వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. అయితే ఇంతలో ఓ వ్యక్తి లోపలికి రావడంతో ఆహ్లాదకర వాతావరణం కాస్తా గందరగోళంగా మారిపోతుంది. దోమల మందు (Mosquito repellent) స్పేయర్ యంత్రంతో లోపలికి వచ్చిన వ్యక్తి.. ఏమాత్రం ఆలోచించకుండా యంత్రాన్ని ఆన్ చేసి మందును స్ప్రే చేస్తాడు. మంటపంలో ఒక్కసారిగా పొగ దట్టంగా వ్యాపించడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలీక అంతా భయాందోళనకు గురయ్యారు. అంతా భయంతో అక్కడి నుంచి తలో దిక్కూ పరుగులు తీశారు.

Viral Video: ఏనుగుల ఘీంకారం పవర్ అంటే ఇదీ.. సింహం దాడి నుంచి చిరుతను ఎలా రక్షించాయో చూస్తే..


అయినా ఆ వ్యక్తి మాత్రం మందును స్ప్రే చేయడం ఆపనేలేదు. ఇంతలో అక్కడికి వచ్చిన కొందరు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ‘‘మంటంపంలోకి ఎవరు రమ్మన్నారు నిన్ను’’.. అని ఆగ్రహం వ్యక్తి చేసి, అతన్ని అక్కడి నుంచి బలవంతంగా బయటికి పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పెళ్లంటే దోమల మంద అనుకున్నాడేమో’’.. అంటూ కొందరు, ‘‘పెళ్లి మంటలపంలో దోమల మందు.. సూపర్’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: స్నేహితురాలి పెళ్లిలో యువకుడి నిర్వాకం.. వధువుకు గిఫ్ట్ ఇచ్చినట్లు ఇస్తూనే ..

Updated Date - May 19 , 2024 | 08:16 PM

Advertising
Advertising