ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: నిర్మానుష్యమైన బీచ్‌లో చిక్కుకుపోయిన వ్యక్తి.. గుళకరాళ్ల సాయంతో ఎలా బయటపడ్డాడంటే..

ABN, Publish Date - Jun 12 , 2024 | 07:22 PM

సాహస యాత్రలు చేసే సమయంలో కొందరికి షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటుంటే.. మరికొందరు వాటి నుంచి ఎంతో చాకచక్యంగా బయటపడుతుంటారు. ఇంకొందరు..

సాహస యాత్రలు చేసే సమయంలో కొందరికి షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటుంటే.. మరికొందరు వాటి నుంచి ఎంతో చాకచక్యంగా బయటపడుతుంటారు. ఇంకొందరు చిన్న చిన్న చిట్కాలతో పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి ఈజీగా బయటపడుతుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నిర్మానుష్యమైన బీచ్‌లో చిక్కుకుపోయాడు. చివరకు చిన్న చిన్న గుళకరాళ్ల సాయంతో ఎలా బయటపడ్డాడో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తర కాలిఫోర్నియాలోని (California) డావెన్‌పోర్ట్ ల్యాండింగ్‌కు దక్షిణాన ఉన్న రిమోట్ బీచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. విండ్‌సర్ఫింగ్‌లో (Windsurfing) అనుభవం ఉన్న ఓ వ్యక్తి.. జూన్ 9న సముద్రంలో తెరచాపను కట్టుకుని పడవపై దూసుకెళ్లాడు. అయితే వాతావరణం అనుకూలించకపోవడం, భారీ ఈదులుగాలులతో పాటూ పెద్ద పెద్ద అలల దాటికి చివరకు బీచ్‌లో రిమోట్ ప్లేస్‌లో చిక్కుకుపోయాడు.

Viral video: చిరుతనే బురిడీ కొట్టించిన కుక్క.. ప్రాణాలు పోయే సమయంలో ఎలాంటి ప్లాన్ వేసిందో చూస్తే..


కొండల మధ్య నిర్మానుష్య ప్రదేశంలో చిక్కుకుపోవడంతో ఎలా వెళ్లాలో అతడికి అర్థం కాలేదు. కనుచూపు మేరలో మనుషులు ఎవరూ కనిపించకపోవడంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే గడిపాడు. అయితే ఎలాగైనా బయటపడాలనే ఉద్దేశంతో అతను చివరకు చాలా తెలివిగా ఆలోచించాడు. బీచ్‌లో ఉన్న గుళకరాళ్లను ఏరుకుని చివరకు పెద్ద ఆకారంలో ‘‘HELP’’ అని రాశాడు. తద్వారా హెలీకాప్టర్‌లో వెళ్తున్న వారు గుర్తించి, అతడిని క్షేమంగా తీసుకొచ్చారు.

Viral video: ఇతనేమైనా.. సూపర్ మ్యాన్ అనుకున్నాడేమో.. రెండు రైళ్ల మధ్య ఎలాంటి స్టంట్ చేశాడంటే..


కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్ అధికారులు ఈ మేరకు వివరాలు వెళ్లడించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చాలా తెలివిగా వ్యవహరించారు’’.. అంటూ కొందరు, ‘‘తెలివిగా ఆలోచించాలేగానీ.. ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 27 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: అప్పగింతల సమయంలో అందరికీ షాక్ ఇచ్చిన వధువు.. చివరకు చుట్టూ అంతా చేరి..

Updated Date - Jun 12 , 2024 | 07:22 PM

Advertising
Advertising