ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

ABN, Publish Date - Aug 16 , 2024 | 08:19 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన ప్రియురాలిని స్కూటీపై ఎక్కించుకుని వెళ్తుంటాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో సిగ్నల్ పడడంతో బండిని రోడ్డు పక్కన నిలిపేస్తాడు. అయితే ఈ క్రమంలో సదరు యువకుడు.. వెనుక కూర్చున్న తన ప్రియురాలి మీద..

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో నెట్టింట ఎక్కడ చూసినా ప్రేమికుల వీడియోలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. పార్కులు, బస్టాండ్లు, రైల్లే స్టేషన్లలో ప్రేమికులు అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తుంటాం. ఇలాంటి వారిని చూసినా చాలా మంది మనకెందొచ్చిన గొడవ అనుకుంటూ అలాగే చూస్తుండిపోతుంటారు. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై సిగ్నల్ వద్ద స్కూటీపై ఉన్న యువకుడు వెనుక ఉన్న తన ప్రియురాలిపై చేయి వేసి మాట్లాడుతుంటాడు. అదే సమయంలో కారులో ఉన్న యువతి వారిని గమనించి దగ్గరికి వెళ్తుంది. చివరకు ఆమె చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన ప్రియురాలిని స్కూటీపై (Scooty) ఎక్కించుకుని వెళ్తుంటాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో సిగ్నల్ పడడంతో బండిని రోడ్డు పక్కన నిలిపేస్తాడు. అయితే ఈ క్రమంలో సదరు యువకుడు.. వెనుక కూర్చున్న తన ప్రియురాలి మీద చేయి మాట్లడుతుంటాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Viral Video: అడుగు పెట్టగానే కుంగిపోయిన నేల.. లోపల తొంగిచూడగా దిమ్మతిరిగే సీన్..


ఆ పక్కనే ఆగి ఉన్న కారులో ఓ యువతి సదరు ప్రేమికులను (lovers) గమనిస్తుంటుంది. చాలా సేపు ప్రేమికులను గమనిస్తున్న ఆమె.. యువకుడు ఆమెపై చేయి వేసి మాట్లాడడంతో కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే కారు దిగి వారి వద్దకు వెళ్తుంది. దీంతో ఆ యువకుడు ఎందుకు వచ్చిందబ్బా.. అని ఆలోచిస్తుంటాడు. దగ్గరికి వెళ్లిన ఆమె.. ప్రియురాలి మీద ఉన్న ప్రియుడి చేయిని పక్కకు తీసేస్తుంది. దీంతో అతడికి విషయం అర్థమై.. తర్వాత కామ్‌గా అక్కడి నుంచి తన ప్రియురాలిని తీసుకుని వెళ్లిపోతాడు.

Viral Video: దాడి నుంచి తప్పించుకోవాడానికి అడవిదున్న మాస్టర్ ప్లాన్.. దాని స్కెచ్ చూసి ఖంగుతిన్న హైనా.. చివరకు..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. చూస్తుంటే, వ్యూస్ కోసం ఇదంతా కావాలని చేసినట్లు అనిపించినా.. వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అంతా బాగానే యాక్టింగ్ చేశారు’’.. అంటూ కొందరు, ‘‘యువతి భలే షాక్ ఇచ్చిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. రైల్లో ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే మతిపోవాల్సిందే.. యువతుల వద్దకు వెళ్లి మరీ..

Updated Date - Aug 16 , 2024 | 09:45 PM

Advertising
Advertising
<