ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అది ఓడ అనుకున్నావా.. ఆర్టీసీ బస్ అనుకున్నావా.. ఇతడేం చేశాడో చూడండి..

ABN, Publish Date - Oct 01 , 2024 | 04:10 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఓడ ప్రయాణం చేసేందుకు టికెట్ బుక్ చేసేకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ... ఇక్కడే ఊహించిన ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులంతా ఓడ ఎక్కేశారు. సమయం దగ్గరపడడంతో..

ప్రయాణ సమయాల్లో చాలా మంది నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు కొన్నిసార్లు కోపం వస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు వస్తుంటుంది. బస్సు, రైళ్లలో వెళ్లే సమయంలో కొందరు ప్రమాదకరంగా ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణాలు చేస్తుంటే.. మరికొందరు తీరా అవి కదిలే సమయంలో పరుగెత్తుకుంటూ వచ్చి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఓడ ఎక్కేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే తీరా ఓడ కదిలే సమయంలో అతడి నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఓడ ప్రయాణం (ship journey) చేసేందుకు టికెట్ బుక్ చేసేకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ... ఇక్కడే ఊహించిన ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులంతా ఓడ ఎక్కేశారు. సమయం దగ్గరపడడంతో ఓడ హారన్ కొడుతూ బయలుదేరేందుకు సిద్ధమైంది. ఒడ్డు నుంచి మెల్లగా స్టార్ట్ అయింది.

Viral Video: ఇంట్లో సడన్‌గా అంటుకున్న మంటలు.. ఎంత పిలిచినా పట్టించుకోని తండ్రి.. చివరకు బుడ్డోడు చేసిన పని..


అయితే ఇంతలో దూరంగా ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ రావడం కనిపించింది. ఓడ వైపు చేతులు ఊపుతూ పరుగెత్తుకుంటూ రావడం చూసి అక్కడున్న వారంతా అతన్నే గమనిస్తున్నారు. సముద్రం ఒడ్డు చివర వరకూ వెళ్లిన అతను.. పదే పదే చేతులు ఊపుతూ.. ‘‘ఆపండి.. ఆపండి’’.. అంటూ అరుస్తున్నాడు. అయితే అప్పటికే ఓడ చాలా దూరం వెళ్లిపోవడంతో చేసేదేమీ లేక.. నిరాశగా అక్కడే నిలబడి దాని వైపే చూస్తుండిపోతాడు. ఆర్టీసీ బస్సును ఆపిన చందంగా.. అంత పెద్ద ఓడను అతను చేతులు ఊపుతూ ఆపమని అరవడం చూసి అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు.

Viral Video: సింహాలను చూడటానికి సఫారీ వాహనాల్లో వెళ్తే.. చివరకు అవి చేసిన నిర్వాకం..


కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అది ఓడ అనుకున్నావా.. ఆర్టీసీ బస్ అనుకున్నావా’’.. అంటూ కొందరు, ‘‘ఇతనేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11వేల లైక్‌లు, 1.6 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చెట్టెక్కినా వదలని ఎలుగుబంటి.. కాలు పట్టుకుని కిందకు లాగేయడంతో.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 01 , 2024 | 04:12 PM