మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: అరే..! ఇదేం వింత టెక్నిక్.. మాంసం ముద్దను బావిలోకి విసరడంతో..

ABN, Publish Date - Mar 20 , 2024 | 04:25 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. మారుమూల ప్రాంతాల్లో ఏ చిన్న వినూత్న ఘటన జరిగినా.. అది ఫొటోలు, వీడియోల రూపంలో ఇట్టే వైరల్ అయిపోతోంది. కొందరు పక్కన పడేసిన వస్తువులతో వింత వింత ప్రయోగాలు చేస్తుంటే.. మరికొందరు...

Viral video: అరే..! ఇదేం వింత టెక్నిక్.. మాంసం ముద్దను బావిలోకి విసరడంతో..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. మారుమూల ప్రాంతాల్లో ఏ చిన్న వినూత్న ఘటన జరిగినా.. అది ఫొటోలు, వీడియోల రూపంలో ఇట్టే వైరల్ అయిపోతోంది. కొందరు పక్కన పడేసిన వస్తువులతో వింత వింత ప్రయోగాలు చేస్తుంటే.. మరికొందరు వింత వింత చేష్టలతో వినూత్న ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పెద్ద మాంసం ముద్దతో చేసిన ప్రయోగం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పెద్ద మాంసం ముద్దతో వింత ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ఇందుకోసం అతను మాంసం ముక్కను సిద్ధం చేసుకుని, దానికి పొడవాటి గొలుసు కట్టేశాడు. తర్వాత దాన్ని ఓ చిన్న బావి వద్దకు తీసుకెళ్లాడు. గొలుసును బావి బయట గడ్డిలో పాతి, మాంసం ముద్దను చేత్తో పట్టుకున్నాడు. మాంసాన్ని ఓ సారి వాసన చూసి, చేతులతో అటూ ఇటూ ఊపి.. చివరకు దాన్ని (man threw the meat piece into the well) బావిలోని నీటిలో విసిరేశాడు. చూస్తుండగానే అది నీటిలోకి వెళ్లిపోయింది. గొలుసు కట్టడం వల్ల నీటిలో వేలాడుతూ ఉండిపోయింది.

Optical illusion: ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలో ఓ తప్పు ఉంది.. దాన్ని కనిపెడితే మాత్రం మీరే జీనియస్..

ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఈ ప్రయోగం చూసి నెటిజన్లకు వింత వింత సందేహాలు వస్తున్నాయి. ఈ మాంసం ముక్కతో అతను ఇలా ఎందుకు చేస్తున్నాడంటూ చర్చించుకుంటున్నారు. అలాగే అది ఏ జంతువు మాంసం..? అని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. చాలా మంది దాన్ని ఆవు కాలేయం అని సమాధానం ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చేపలు పట్టే పద్ధతి ఇలాగే ఉంటుందని చెబుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలా చేయడం వల్ల బావిలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది’’.. అంటూ కొందరు, ‘‘చేపలు పట్టే టెక్నిక్ చాలా బాగుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: రోబోటిక్ డాగ్‌ను చూసి ఖంగుతిన్న కుక్క.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Mar 20 , 2024 | 04:25 PM

Advertising
Advertising