ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: గేదె మెడలో దండ వేసి పెళ్లి చేసుకున్నాడు.. ఆ వెంటనే అతడు చేసిన నిర్వాకంతో..

ABN, Publish Date - Jun 06 , 2024 | 08:09 PM

కాదేదీ కవితకు అనర్హం.. అన్న సామెత చందంగా.. ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో కాస్త వినూత్నంగా ఉండే చిన్న చిన్న ఘటనలు కూడా వీడియోల రూపంలో వైరల్ అవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది..

కాదేదీ కవితకు అనర్హం.. అన్న సామెత చందంగా.. ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో కాస్త వినూత్నంగా ఉండే చిన్న చిన్న ఘటనలు కూడా వీడియోల రూపంలో వైరల్ అవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది యువత.. నెటిజన్ల దృష్టిలో పడేందుకు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు మొదటికే మోసం వస్తుంటుంది. ఇలాంటి వినూత్న ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి గేదె మెడలో దండ వేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ వెంటనే అతడు చేసిన పనికి..చివరకు ఏమైందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. నెట్టింట వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఓ ఆకతాయి పిచ్చి పనికి పూనుకున్నాడు. ఆ గేదెను పట్టుకొచ్చి, దాన్ని పెళ్లి చేసుకునేందుకు (man married buffalo) సిద్ధమయ్యాడు. దాని మెడలో దండ వేసి, తర్వాత తానూ వేసుకున్నాడు. ఆ తర్వాత గేదెకు బొట్టు పెట్టి దానిపై ఓ కొత్త గుడ్డను కూడా కప్పాడు. చివరగా గేదె పక్కన నిలబడ్డ అతడికి.. ఓ మహిళ హారతి కూడా ఇచ్చింది. ఫైనల్‌గా గేదె పైకి ఎక్కి స్వారీ చేయాలనేది వారి ఉద్దేశం. ఆ విధంగానే సదరు యువకుడు గేదెపైకి ఎక్కి కూర్చున్నాడు.

Optical illusion: ఈ రెండు చిత్రాల్లోని 5 తేడాలను గుర్తించడం మీకు సాధ్యమేనా..


అతడు ఇలా కూర్చోగానే గేదె పరుగందుకుంది. అది పరుగెత్తిన వేగానికి పైన ఉన్న ఆ వ్యక్తి సడన్‌గా బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయాడు. దెబ్బకు అతడి కాలికి తీవ్రగాయమైంది. దీంతో కుయ్యో.. మొర్రో.. అంటూ కేకలు పెట్టాడు. మరో యువకుడు పరుగెత్తుకుంటూ వెళ్లి అతన్ని పైకి లేపి పక్కకు తీసుకెళ్లాడు. దూరంగా వెళ్లి ఆగిన గేదె.. వెనక్కు తిరిగి వారి వైపు చూస్తుంది. ‘‘ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే రియాక్షన్ ఇంకోలా ఉంటుంది... జాగ్రత్త’’.. అని హెచ్చరిస్తున్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది.

Viral Video: ఆస్పత్రి వార్డులోకి దూసుకెళ్లిన ఏనుగు.. కారణం తెలిస్తే.. గుండె తరుక్కుపోతుంది..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి పిచ్చి పనులు చేసే వారికి ఇలాగే జరగాలి’’.. అంటూ కొందరు, ‘‘వీడియోల పేరుతో మూగజీవాలను హింసించడం తగదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: సింహాల మధ్యలోకి రాయల్‌‌‌గా ఎంట్రీ ఇచ్చాడు.. చివరకు ఏమైందో మీరే చూడండి..

Updated Date - Jun 06 , 2024 | 08:09 PM

Advertising
Advertising