Viral Video: అరే.. ఇలాంటి ఐడియాలు మనకెందుకు రాలేదూ.. ఒకే కనెక్షన్‌తో రెండు ఫ్యాన్లను..
ABN, Publish Date - Sep 11 , 2024 | 09:40 PM
తెలిసి ఒకరి సొత్తు కాదు.. అన్న సామెత చందంగా కొందరు సాధారణానికి భిన్నంగా ఆలోచిస్తూ చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలు చూడ్డానికి షాక్ అయ్యేలా ఉండడంతో పాటూ అనితర సాధ్యం అనిపిస్తుంటాయి. మరికొందరు చేసే ప్రయోగాలు చూస్తే ఆశ్చర్యం కలగడంతో పాటూ ఆపుకోలేని నవ్వు వస్తుంటుంది. ఇలాంటి..
తెలిసి ఒకరి సొత్తు కాదు.. అన్న సామెత చందంగా కొందరు సాధారణానికి భిన్నంగా ఆలోచిస్తూ చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలు చూడ్డానికి షాక్ అయ్యేలా ఉండడంతో పాటూ అనితర సాధ్యం అనిపిస్తుంటాయి. మరికొందరు చేసే ప్రయోగాలు చూస్తే ఆశ్చర్యం కలగడంతో పాటూ ఆపుకోలేని నవ్వు వస్తుంటుంది. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఒకే కనెక్షన్‌తో రెండు ఫ్యాన్లను వాడడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అరే.. ఇలాంటి ఐడియాలు మనకెందుకు రాలేదూ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఫ్యాన్లను వాడే విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఒక కనెక్షన్‌కు ఒక ఫ్యానే ఎందుకు వాడాలి.. రెండు ఫ్యాన్లు ఎందుకు వాడకూడదు.. అని వినూత్నంగా ఆలోచించాడు. ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలో పెట్టేశాడు. రెండు సీలింగ్ ఫ్యాన్లను (Ceiling fans) సిద్ధం చేసుకుని వాటిని పొడవాటి ఇనుప్ రాడ్‌కు రెండు వైపులా జాయిట్ చేశాడు.
Viral Video: గడ్డితో చేసిన డ్రస్ వేసుకుని డాన్స్ వేస్తున్న బాలిక.. చివరకు గేదె చేసిన పనికి..
తర్వాత వాటి మధ్యలో బేరింగ్ ఏర్పాటు చేసి, చివరగా దాన్ని ఇంటి సీలింగ్‌కు అమర్చాడు. రెండు ఫ్యాన్లకు ఒకే కనెక్షన్ ఇచ్చి చివరగా స్విచ్ వేశాడు. దీంతో రెండు ఫ్యాన్లు ఒకేసారి తిరగడమే కాకుండా వాటికి జాయింట్ చేసిన ఇనుప రాడ్ కూడా తిరుగుతూ ఉండడంతో గది మొత్తం గాలి పెద్ద ఎత్తున రావడం స్టార్ట్ అయింది. అలాగే టేబుల్ ఫ్యాన్లు (Table fans) కూడా స్టాండ్‌పై రెండు ఏర్పాటు చేశాడు. ఆన్ చేయడంతో అటూ, ఇటూ రెండు వైపులా తిరుగుతూ గది మొత్తం గాలిని స్ప్రెడ్ చేస్తున్నాయి.
Viral Video: మహిళకు లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. కారులో ఛేజ్ చేసిన యువకులు.. చివరకు అసలు విషయం చెప్పడంతో..
ఇలా రెండు ఫ్యాన్లను ఒకేసారి రన్ చేస్తూ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాడు. ఈ విచిత్ర ప్రయోగానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘ఒక కనెక్షన్‌కు రెండు ఫ్యాన్లు.. ఐడియా అదుర్స్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: బంగాళాదుంపల బాక్సు నుంచి వింత శబ్ధాలు.. కంగారుగా తెరచి చూడగా.. షాకింగ్ సీన్..
ఇవి కూడా చదవండి..
Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..
Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..
Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..
మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Sep 11 , 2024 | 09:47 PM