Viral Video: కాలువలో కొట్టుకుపోతున్న స్నేహితుడిని.. చివరకు చిన్న ట్రిక్‌తో రెప్పపాటులో ఇలా..

ABN, Publish Date - Jul 27 , 2024 | 03:54 PM

చాలా మంది కళ్ల ముందు ప్రమాదం జరుగుతున్నా చూస్తూ ఉండిపోతారు తప్ప కాపాడే ప్రయత్నం చేయరు. కొందరైతే కాపాడకపోగా ఫోన్లతో వీడియోలు తీస్తూ చోద్యం చూస్తుంటారు. అయితే కొందరు మాత్రం అలా కాకుండా.. ప్రమాదంలో...

Viral Video: కాలువలో కొట్టుకుపోతున్న స్నేహితుడిని.. చివరకు చిన్న ట్రిక్‌తో రెప్పపాటులో ఇలా..

చాలా మంది కళ్ల ముందు ప్రమాదం జరుగుతున్నా చూస్తూ ఉండిపోతారు తప్ప కాపాడే ప్రయత్నం చేయరు. కొందరైతే కాపాడకపోగా ఫోన్లతో వీడియోలు తీస్తూ చోద్యం చూస్తుంటారు. అయితే కొందరు మాత్రం అలా కాకుండా.. ప్రమాదంలో ఉన్న వారిని తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కాపాడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కాలువలో కొట్టుకుపోతున్న స్నేహితుడిని ఓ యువకుడు చిన్న ట్రిక్‌తో రెప్పపాటులో ఎలా కాపాడడో చూస్తే.. శభాష్ అని అంటారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు స్నేహితులు కాలువ వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వారిలో ఓ వ్యక్తి స్నానం చేసేందుకు నిరాకరించాడు. ఇంకో వ్యక్తి మాత్రం అదేమీ పట్టించుకోకుండా నీటిలోకి దూకేశాడు. అయితే ప్రవాహ ఉదృతికి నీటిలో కొట్టుకుపోయాడు.

Viral Video: వరద నీటిలో ఆగిపోయిన కారు.. గమనించిన కుక్క ఎలా సాయం చేసిందో చూడండి..


స్నేహితుడు కొట్టుకుపోవడాన్ని చూసిన మరో వ్యక్తి చేతిలో టవల్ తీసుకుని పరుగెత్తుకుంటూ వెళ్లి కాలువపై ఉన్న బ్రిడ్జిపైకి వెళ్లాడు. కాలువకు అటూ ఇటూ ఏర్పాటు చేసిన స్తంభాలపై పడుకున్నాడు. నీటిలో కొట్టుకుంటూ వస్తున్న స్నేహితుడు సరిగ్గా దగ్గరికి రాగానే టవల్‌ను విసిరాడు. టవల్‌ను పట్టుకోగానే పైనుంచి అతన్ని గట్టిగా పైకి లాగేశాడు. అది కష్టసాధ్యంగా ఉన్నా కూడా అతన్ని వదలకుండా (man saves friend who is drowning in canal) ఎంతో శ్రమించి పైకిలాగి అతడి ప్రాణాలను కాపాడాడు.

Viral Video: చిన్న పిల్లాడిలా మారిన ఎలుక.. వంటింట్లో అది చేస్తున్న నిర్వాకం చూడండి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి స్నేహితుడు ఒక్కడు ఉన్నా చాలు’’.., ‘‘ప్రాణాలకు తెగించి కాపాడడం గ్రేట్’’.. ‘‘సినిమాను మించిన ట్విస్ట్’’.., ‘‘చూస్తుంటే ఇది వ్యూస్ కోసం చేసినట్లు ఉన్నా.. సందేశాత్మకంగా ఉంది’’.., ‘‘ఇదంతా కావాలని చేసినట్లుగా అనిపిస్తోంది’’.. అంటూ కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వైట్ కోబ్రా పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. పామును లోపలికి వదలడంతో.. చూస్తుండగానే..

Updated Date - Jul 27 , 2024 | 03:54 PM

Advertising
Advertising
<