Viral Video: గుండె ఆగిపోయే సీన్.. ప్రాణాలంటే లెక్కేలేదా..?
ABN, Publish Date - Aug 02 , 2024 | 02:02 PM
ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో చాలా మంది తమ ప్రాణాల కంటే వ్యూస్‌కు లైక్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలాగైనా నెట్టింట ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ప్రాణాలకు తెగించిమరీ వివిధ రకాల విన్యాసాలు చేస్తున్నారు. కొందరైతే...
ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో చాలా మంది తమ ప్రాణాల కంటే వ్యూస్‌కు లైక్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలాగైనా నెట్టింట ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ప్రాణాలకు తెగించిమరీ వివిధ రకాల విన్యాసాలు చేస్తున్నారు. కొందరైతే ప్రాణాలు పోతాయని తెలిసినా లెక్కచేయడం లేదు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి జలపాతం వద్ద ప్రాణాలకు తెగించి చేసిన విన్యాసం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ప్రాణాలంటే లెక్కేలేదా..?’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు, జలపాతాలు పొంగి ప్రవహిస్తు్న్నాయి. ఈ క్రమంలో అనేక మంది పర్యాటకులు జలపాతాలు చూసేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొందరు రీల్స్ వీడియోల కోసం వివిధ రకాల విన్యాసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
Viral Video: మద్యం మత్తులో డ్రైవింగ్ సీటు దిగి మరీ.. ఇతడు చేసిన డేంజరస్ స్టంట్ చూస్తే..
తాజాగా, ఓ వ్యక్తి ఇలాంటి పనే చేశాడు. ఓ జలపాతం పైన నిలబడిన వ్యక్తి కిందకు దూకేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా.. జలపాతం పైనుంచి దూకేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతను కాస్త దూరం నడవగానే (man fell into waterfall) కాలు జారి పడిపోయాడు. చూస్తుండగానే అంతెత్తునుంచి నీళ్లలో పడిపోయాడు. కింద రాళ్లకు తగులుకుని నీళ్లలో పడిపోయాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చాలా మంది కేకలు వేస్తూ అతడిని కాపాడేందుకు పరుగులు తీశారు.
ఈ ఘటన చూస్తుంటే ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి విన్యాసాలు చేస్తే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘జలపాతాల వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1600కి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Updated Date - Aug 02 , 2024 | 02:02 PM