మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఆ ఊరి బ్యాచిలర్లకు వింత కష్టం.. పెళ్లిళ్లు కాకపోవడానికి గల కారణం తెలిస్తే..

ABN, Publish Date - Mar 14 , 2024 | 12:10 PM

టెక్నాలజీలో రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నా.. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ప్రజలు కనీస సౌకర్యాల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు సమస్యలు వింటే అయ్యో.. పాపం..! అని అనిపిస్తే.. మరికొందరి సమస్యలు వింటే.. ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి...

Viral: ఆ ఊరి బ్యాచిలర్లకు వింత కష్టం.. పెళ్లిళ్లు కాకపోవడానికి గల కారణం తెలిస్తే..

టెక్నాలజీలో రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నా.. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ప్రజలు కనీస సౌకర్యాల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు సమస్యలు వింటే అయ్యో.. పాపం..! అని అనిపిస్తే.. మరికొందరి సమస్యలు వింటే.. ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వింత సమస్యకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ ఊరి యువకులకు ఎవరినీ రాని వింత కష్టం వచ్చింది. వీళ్లకు పెళ్లిళ్లు కాకపోవడానికి గల కారణాలు తెలుసుకుని అంతా అవాక్కవుతున్నారు.

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) జరువా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామంలో యువకులకు వింత కష్టం వచ్చి పడింది. ఈ గ్రామంలో మొత్తం 1200 మంది జనాభా ఉన్నారు. అయితే గ్రామస్తులను 18 ఏళ్లుగా నీటి సమస్య (Water problem) పట్టి పీడిస్తోంది. దీంతో సుమారు కిలోమీటరకు పైగా దూరం వెళ్లి కోనేరు వద్ద నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇదిలావుండగా, ఈ ఊరికి పిల్లను ఇవ్వాలంటేనే తల్లిదండ్రులు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. చివరికి పాత్రలు శుభ్రం చేయడానికి నీరు కావాలన్నా కోనేరు వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ల ఇబ్బందుల గురించి తెలుసుకున్న యువతులు.. ఈ ఊరి అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు.

Viral Video: వాహనదారులకు షాక్ ఇచ్చిన మహిళ.. ట్రాఫిక్ జామ్‌ను కూడా ఎలా సద్వినియోగం చేసుకుందంటే..

madhyapradesh-trending-news.jpg

ఈ కారణంగా గ్రామంలో చాలా మంది యువకులు బ్రహ్మచారులుగా (bachelor) మిగిలిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. కొందరు డబ్బులు ఉన్న వారు తమ పిల్లలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అద్దె ట్యాంకర్లను తెప్పిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని ప్రజలు చెబుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ, ఈ ప్రాంతంలోని నేలలో బండ ఎక్కువగా ఉందని, దీంతో ఎన్నిసార్లు బోర్లు వేయించినా నీరు రాలేదని చెప్పారు. సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Optical illusion: ఈ అడవిలో కలిసిపోయిన పక్షిని గుర్తిస్తే.. మీకు తిరుగు లేనట్లే..

Updated Date - Mar 14 , 2024 | 12:10 PM

Advertising
Advertising