ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ట్యాక్సీ డ్రైవర్ నుంచి మెసేజ్.. లండన్‌లో పిల్లలను వదిలి ఇండియాకు.. ఆరా తీసిన భర్తకు దిమ్మతిరిగే షాక్..

ABN, Publish Date - Oct 08 , 2024 | 07:21 PM

‘‘మీరు ఎంతో అందంగా ఉన్నారు.. మీ నవ్వు ఇంకా అందంగా ఉంటుంది.. అలాగే మీ మనసు కూడా ఎంతో మంచిది’’.. ఇది.. ఓ ట్యాక్సీ డ్రైవర్ నుంచి మహిళకు వెళ్లిన మెసేజ్. ఈ ఒక్క మెసేజ్.. తనకు వివాహమై భర్త, పిల్లలు కూడా ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయేలా చేసింది. ఏకంగా..

ప్రతీకాత్మక చిత్రం

‘‘మీరు ఎంతో అందంగా ఉన్నారు.. మీ నవ్వు ఇంకా అందంగా ఉంటుంది.. అలాగే మీ మనసు కూడా ఎంతో మంచిది’’.. ఇది.. ఓ ట్యాక్సీ డ్రైవర్ నుంచి మహిళకు వెళ్లిన మెసేజ్. ఈ ఒక్క మెసేజ్.. తనకు వివాహమై భర్త, పిల్లలు కూడా ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయేలా చేసింది. ఏకంగా లండన్ నుంచి హైదరాబాద్ కూడా రప్పించింది. భార్య కనిపించకపోయేసరికి భర్తకు అనుమానం మొదలైంది. చివరకు విచారించగా.. సినిమాకు మించిన ట్విస్ట్‌లు బయటపడ్డాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ (Hyderabad) నగర పరిధి అల్వాల్‌కు చెందిన గీత, వాసు (పేర్లు మార్చాం) దంపతులకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ప్రస్తుతం 13 ఏళ్ల కొడుకు, 12 ఏళ్ల కూతురు ఉన్నారు. భర్త ఉద్యోగ రీత్యా కొన్ని నెలల కిందటే.. భార్యా, పిల్లలతో లండన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఇలా సవ్యంగా సాగుతున్న వీరి సంసారంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. గత ఫిబ్రవరిలో గీత తల్లి చనిపోవడంతో పిల్లలతో కలిసి ఇండియాకు వచ్చింది.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న కుక్క పిల్లను 20 సెకన్లలో కనుక్కోవడం మీ వల్ల అవుతుందా..


ఈ క్రమంలో తల్లి అస్తికలను గంగలో కలిపేందుకు కారుకు అద్దెకు తీసుకుంది. కారులో వెళ్లి తన తల్లి అస్తికలను కాశీలోని గంగానదిలో కలిపేసింది. అక్కడి నుంచి ఇంటికి రాగానే.. కారు అద్దెకు సంబంధించి నగదును గీత.. సదరు డ్రైవర్‌కు గూగుల్ పే (Google Pay) ద్వారా చెల్లించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడి నుంచే అసలు సమస్యలు స్టార్ట్ అయ్యాయి. ఆమెపై కన్నేసిన ట్యాక్సీ డ్రైవర్.. గూగుల్ పే ద్వారా ఆమె నంబర్ తెలుసుకుని మెసేజ్ చేశాడు. ‘‘మీరు ఎంతో అందంగా ఉన్నారు.. మీ నవ్వు ఇంకా అందంగా ఉంటుంది’’.. అంటూ ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తూ వరుసగా మెసేజ్‌లు చేయసాగాడు. ఆ మెసేజ్‌లు చూసి ఆమె కూడా అతడి మాయలో పడిపోయింది.

Viral Video: మొసలి వేషంలో మొసళ్లనే భయపెట్టాడు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


ఇలా ఇద్దరి మధ్య రోజురోజుకూ చాటింగ్ పెరిగిపోయింది. ఇది గమనించిన గీత అత్త.. ఓ రోజు లండన్‌లో ఉన్న కొడుక్కు చెప్పింది. దీంతో అతను వెంటనే తన భార్య, పిల్లలను లండన్‌కు పిలిపించుకున్నాడు. అయితే సెప్టెంబర్ 29న వాసు తల్లి కూడా మరణించడంతో అతడొక్కడే ఇండియాకు వచ్చాడు. భర్త లేకపోవడంతో సెప్టెంబర్ 30న తన పిల్లలను పార్క్‌లో వదిలేసి, ఆమె కూడా ఇండియాకు వచ్చేసింది. తల్లి కనిపించలేదంటూ పిల్లలు.. తన తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో అతను హుటాహుటిన లండన్ వెళ్లా్ల్సి వచ్చింది. చివరకు ఆరాతీయగా.. భార్య ముంబై వెళ్లి, అటు నుంచి అటే శంషాబాద్ మధునాగర్ కాలనీకి వెళ్లినట్లు తెలిసింది.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..


భార్యకు ఫోన్ చేయగా తనను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పింది. దీంతో వాసు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో వాసు స్నేహితులు ఆమెకు ఫోన్ చేయగా.. ట్రాక్సీ డ్రైవర్ తనను గోవా తీసుకెళ్లాడని చెప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఎట్టకేలకు వారిని ఆదివారం ఉదయం అమన్‌గల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి గీతను లండన్‌కు విమానం ఎక్కించి పంపించారు. ట్రాక్సీ డ్రైవర్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. అపరితవ్యక్తులు చెప్పే మాయ మాటలు నమ్మి మోసపోవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 08 , 2024 | 07:26 PM