ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: కిటికీలకు గుంపులుగా వేలాడుతున్న యువకులు.. విషయం ఏంటా సమీపానికి వెళ్లి చూడగా..

ABN, Publish Date - Mar 07 , 2024 | 05:53 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఎలాంటి విచిత్ర ఘటన చోటు చేసుకున్న ఇట్టే నెట్టింట్లోకి చేరిపోతోంది. ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో ఇలా ఫొటోలు, వీడియోలు తీసి.. అలా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఎలాంటి విచిత్ర ఘటన చోటు చేసుకున్న ఇట్టే నెట్టింట్లోకి చేరిపోతోంది. ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో ఇలా ఫొటోలు, వీడియోలు తీసి.. అలా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చాలా మంది యువకులు పెద్ద భవనం గోడపై కిటికీలకు వేలాడుతూ కనిపించారు. విషయం ఏంటా అని సమీపానికి వెళ్లి చూడగా.. అసలు విషయం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు.

హర్యానాలో (Haryana) ఈ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మార్చి 26 వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇదిలావుండగా, చాలా ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాల్లో మాస్ కాఫీయింగ్ (mass copying) జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి ఘటనలకు సంబంధించిన (Viral photos videos) ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, నుహ్ జిల్లా తవడు చంద్రావతి స్కూల్‌ పరీక్ష కేంద్రానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న కేంద్రం (10th Class Exam Center) వద్ద చాలా మంది యువకులు గుమికూడి ఉన్నారు.

Viral Video: యువతి నిర్వాకానికి అవాక్కైన ప్రయాణికులు.. ఆమె చేష్టలతో అంతా విసిగిపోయినా..

వారిలో కొందరు భవనం వెనుక వైపు నుంచి కిటికీల వద్ద ప్రమాదకరంగా వేలాడుతూ, లోపల ఉన్న విద్యార్థులకు పేపర్ స్లిప్పులను విసిరేశారు. ఒక్కో కిటికీ వద్ద ఒక్కొక్కరు గబ్బిలాల తరహాలో వేలాడుతూ పేపర్ స్లిప్పులను అందిస్తున్నారు. ఏమాత్రం అదుపు తప్పినా కిందపడిపోయే ప్రమాదం ఉంది. అయినా వారిలో ఏమాత్రం భయం కనిపించలేదు. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! వీళ్ల కాఫీయింగ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Puzzle: ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో 3 తేడాలు ఉన్నాయి.. కనిపెట్టడం మీ వల్ల అవుతుందేమో ప్రయత్నించండి..

Updated Date - Mar 07 , 2024 | 05:54 PM

Advertising
Advertising