మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: కొండచిలువను చుట్టిముట్టిన ముంగిసల మంద.. భీకర పోరులో చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్..

ABN, Publish Date - Apr 30 , 2024 | 07:31 PM

కొండచిలువల దాడి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి జంతువులనైనా ఇట్టే మింగేస్తుంటాయి. అందుకే వాటి జోలికి వెళ్లేందుకు ఎలాంటి జంతువైనా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది. కొండచిలువ దాడి చేసే సమయంలో కొన్నిసార్లు అవతలి జంతువులు ఎదురుదాడి చేస్తుంటాయి. ఇలాంటి...

Viral Video: కొండచిలువను చుట్టిముట్టిన ముంగిసల మంద.. భీకర పోరులో చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్..

కొండచిలువల దాడి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి జంతువులనైనా ఇట్టే మింగేస్తుంటాయి. అందుకే వాటి జోలికి వెళ్లేందుకు ఎలాంటి జంతువైనా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది. కొండచిలువ దాడి చేసే సమయంలో కొన్నిసార్లు అవతలి జంతువులు ఎదురుదాడి చేస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో బిగ్ ఫైట్ జరుగుతుంటుంది. అయితే ఈ పోటీలో చివరకు చాలాసార్లు కొండచిలువలే పైచేయి సాధిస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ముంగిసల మంద కొండచిలువను చుట్టుముట్టాయి. ఈ భీకర పోరులో చివరకు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికా మార్లోత్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కొండ చిలువ ఆహారం కోసం వెతుకుతుండగా.. దానికి ముంగిసల మంద కనిపిస్తుంది. కొండచిలువను చూడగానే ముంగిసలన్నీ ఒక్కసారిగా దానిపై దాడికి దిగుతాయి. కొండచిలువ కూడా వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ఎదురుదాడి చేసింది. అయితే ముంగిసలు ఎక్కువ ఉండడంతో వాటిని ఎదురించడం దానికి సాధ్యం కాలేదు. కొండచిలును చుట్టుముట్టిన ముంగిసలు పదే పదే దాడి చేస్తూ పొడిచేశాయి.

Viral Video: విషపూరిత పామును వెనిగర్‌లో ముంచాడు.. చివరకు గ్లాసులో జ్యూస్ తీసి..


దీంతో కొండచిలువ వాటి నుంచి తప్పించుకునేందుకు దూరంగా పారిపోయింది. అయినా ముంగిసలు (Mongoose attack on python) వదలకుండా కొండచిలువను వెంబడించాయి. ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలనే ఉద్దేశంతో కొండచిలువ కూడా విశ్వప్రయత్నం చేసింది. అక్కడి నుంచి మరింత దూరం వెళ్లిపోయింది. దీంతో ముంగిసల్లో చాలా వరకు వెనుదిరిగాయి. కొన్ని మాత్రం కొండచిలువను అనుసరిస్తూనే వెళ్లాయి.

Viral Video: 2050లో ఉన్నామా..! ఆశ్చర్యానికి గురి చేస్తున్న 19 సెకన్ల వీడియో.. స్మార్ట్‌ఫోన్ లోపల వేయగానే..


చివరకు అవి దాడి చేస్తున్నా కూడా కొండచిలువ మాత్రం ఎలాగోలా చెట్టు పైకి పాకుతూ వెళ్లి ప్రాణాలను కాపాడుకుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘కొండచిలువ పోరాటం ఫలించింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇష్టం లేకున్నా బలవంతం చేశాడు.. చివరకు వధువు రియాక్షన్ చూసి ఖంగుతిన్నాడు..

Updated Date - Apr 30 , 2024 | 07:31 PM

Advertising
Advertising