ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: శెభాష్ వానరమా.. మనిషికే పాఠం నేర్పావ్!

ABN, Publish Date - May 15 , 2024 | 05:07 PM

'నీటిని వృథా చేయరాదు' అని పాఠశాల స్థాయి నుంచి మనం వింటూనే ఉంటాం. కానీ నిజ జీవితంలో కళ్ల ముందే ఎన్నో లీటర్ల నీరు వృథాగా పోతుంటుంది. ఇతరులు వృథా చేసేవి కొన్నైతే.. మరికొన్ని మన నిర్లక్ష్యంతో జరిగేవి. అయితే నీటిని పొదుపు చేయాలంటూ కనువిప్పు కలిగించింది ఓ వానరం.

ఇంటర్నెట్ డెస్క్: మేధో సంపత్తితో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో అద్భుతాలు సృష్టించిన మానవుడు చాలాసార్లు చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తుంటాడు. ఆ నిర్లక్ష్యం భవిష్యత్తులో చాలా ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి సమయంలోనే ప్రకృతి ఏదో రూపంలో మనకు కనువిప్పు కలగజేస్తుంది. 'నీటిని వృథా చేయరాదు' అని పాఠశాల స్థాయి నుంచి మనం వింటూనే ఉంటాం.

కానీ నిజ జీవితంలో కళ్ల ముందే ఎన్నో లీటర్ల నీరు వృథాగా పోతుంటుంది. ఇతరులు వృథా చేసేవి కొన్నైతే.. మరికొన్ని మన నిర్లక్ష్యంతో జరిగేవి. అయితే నీటిని పొదుపు చేయాలంటూ కనువిప్పు కలిగించింది ఓ వానరం(Monkey). సంబంధింత వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఆ వీడియోలో.. ఓ కోతికి దాహం వేసింది. ఓ కుళాయి దగ్గర నీరు రావడాన్ని గమనించింది. కుళాయిని ఆన్ చేసి నీటిని తాగింది. దాహం తీరాక కుళాయిని కట్టేసి.. నీటి వృథాను అరికట్టింది.


ఈ వీడియో చూసిన నెటిజన్లు శభాష్ వానరమా అని కామెంట్లు చేస్తున్నారు. నీరు లేకుంటే భవిష్యత్తు లేదనే విషయాన్ని కోతి గ్రహించిందని.. ప్రతి ఒక్కరు నీటి సంరక్షణకు ముందడుగేయాలని పిలుపునిచ్చిందని అంటున్నారు. మూగ జీవే అయినా ఎంతో మంచి మెసేజ్ ఇచ్చిందని ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు నీటిని వృథా చేయకుండా.. సంరక్షించాలని వారు సూచిస్తున్నారు. వానరం ఇచ్చిన మెసేజ్ భలే ఉంది కదూ...

Read Latest Viral News and Telugu News

Updated Date - May 15 , 2024 | 05:20 PM

Advertising
Advertising