ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఈ తల్లి గొరిల్లా యాక్టింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. పిల్ల గొరిల్లా పదే పదే పిలుస్తున్నా..

ABN, Publish Date - May 02 , 2024 | 09:51 PM

మనుషుల ప్రవర్తనను మక్కీకి మక్కీ దించడంలో గొరిల్లాలు ముందుంటాయి. అవి ప్రవర్తించే తీరు చూస్తే.. అచ్చం మనుషుల్లాగే ఉంటుంది. మనుషులు చేసే అన్ని రకాల పనులను అవి కూడా అనికరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి...

మనుషుల ప్రవర్తనను మక్కీకి మక్కీ దించడంలో గొరిల్లాలు ముందుంటాయి. అవి ప్రవర్తించే తీరు చూస్తే.. అచ్చం మనుషుల్లాగే ఉంటుంది. మనుషులు చేసే అన్ని రకాల పనులను అవి కూడా అనికరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పిల్ల గొరిల్లా పదే పదే పిలుస్తున్నా పట్టించుకోకుండా తల్లి గొరిల్లా ప్రవర్తించిన తీరు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ తల్లి గొరిల్లా ( mother gorilla) గోడ పక్కన కూర్చుని ఉంటుంది. అదే సమయంలో దాని పిల్ల అక్కడికి వస్తుంది. అంతకు ముందు అది ఏ తప్పు చేసిందో తెలీదు గానీ.. పిల్ల గొరిల్లాకు పదే పదే చెప్పి తల్లి గొరిల్లా అలసిపోయినట్లుంది. దిగాలుగా కూర్చుని ఉన్న తల్లి వద్దకు పిల్ల గొరిల్లా వెళ్తుంది. కానీ తల్లి మాత్రం పట్టీపట్లనట్లు ఉంటుంది. దీంతో తల్లి తన వైపు చూడాలని పిల్ల గొరిల్లా పదే పదే కొడుతుంది.

Viral Video: పాము కాటుతో చనిపోవడంతో.. నీటిలో వేలాడదీశారు.. చివరికి రెండు రోజుల తర్వాత..


అయినా తల్లి గొరిల్లా మాత్రం ఏమాత్రం పట్టనట్లుగా పక్కకు చూస్తుంటుంది. దీంతో ఎలాగైనా తన వైపు చూడాలని పిల్ల గొరిల్లా పదే పదే ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. కానీ తల్లి గొరిల్లా మాత్రం మిన్నకుండిపోతుంది. ఆ సమయంలో దాని నటన చూస్తే అచ్చం మనుషుల్లాగే అనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ తల్లి గొరిల్లా యాక్టింగ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘అచ్చం మనుషుల్లాగే చేస్తున్నాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇలాంటి దృశ్యాలను ఎక్కడైనా చూశారా.. వీరి తెలివి మామూలుగా లేదుగా..

Updated Date - May 02 , 2024 | 09:51 PM

Advertising
Advertising