ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వరద నీరు ఇంట్లోకి రాకుండా ఇలా చేసిందేంటీ.. కొడుకును ఎలా సెట్ చేసిందో చూస్తే నోరెళ్లబెడతారు..

ABN, Publish Date - Sep 14 , 2024 | 07:55 PM

వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీ వర్షాలు కురిసిన సమయంలో వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచేస్తుంటుంది. వరద నీరు ఇళ్లల్లోకి చేరి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీ వర్షాలు కురిసిన సమయంలో వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచేస్తుంటుంది. వరద నీరు ఇళ్లల్లోకి చేరి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వరద నీరు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు ఓ మహిళ చేసిన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇంతకీ ఈమె చేసిన నిర్వాకం చూస్తే.. మీరు కూడా నోరెళ్లబెడతారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. భారీ వర్షం కురవడంతో చూస్తుండగానే వరద నీరు (flood water) మొత్తం లోతట్టు ప్రాంతానికి వచ్చి చేరింది. ఇళ్ల ఎదురుగా వరద నీరు వేగంగా ప్రవహిస్తోంది. దీంతో వరద నీరు ఇళ్లల్లోకి రాకుండా అంతా వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఓ మహిళ (woman) తన ఇంట్లోకి వరద నీరు రాకుండా తీసుకున్న జాగ్రత్తలు చూసి అంతా అవాక్కయ్యారు.

Viral Video: వామ్మో.. హెల్మెట్ లేకపోయి ఉంటే ఏమై ఉండేదో.. ఈ బైకర్‌కు ఏమైందో మీరే చూడండి..


వరద నీరు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు.. తన కొడుకును ఇంటి గడప ముందు కాళ్లు చాపి కూర్చోబెట్టింది. దీంతో ఇంటి ముంగిట్లోకి వచ్చిన వరద నీరు.. అతడు కాళ్లు చాపి కూర్చోవడంతో దిశ మారి మళ్లీ రోడ్డుపైకే వెళ్లిపోతోంది. పక్కనే నిలబడ్డ మహిళ.. చీపురుతో తలుపు వద్దకు వచ్చే కొద్ది పాటి నీటిని బయటికి తోస్తూ ఉంది. మరోవైపు వరద నీటిలో కూర్చున్న కొడుకు.. ‘‘వామ్మో.. ఇక నావల్ల కాదు బాబోయ్’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ ఇబ్బంది పడుతుంటాడు.

Viral Video: ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి వింత శబ్ధాలు.. ఏముందా అని చూడగా.. ఒక్కసారిగా ఏమైందో చూడండి..


అయినా ఆమె మాత్రం అతన్ని అక్కడే బలవంతంగా కూర్చోబెట్టినట్లు.. వీడియో చూస్తే అర్థమవుతోంది. అయితే చూస్తుంటే ఇదంతా సరదా కోసం చేసినట్లుగా ఉన్నా కూడా.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ తల్లి ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘వరద నీటిని ఇంట్లోకి రాకుండా ఇలాక్కూడా చేయొచ్చా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 14 , 2024 | 07:55 PM

Advertising
Advertising