Viral: ఇది నిజంగా అద్భుతం.. నేనైతే ఫిదా.. యువకుడిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు!
ABN, Publish Date - Mar 15 , 2024 | 06:06 PM
ఐప్యాడ్‌పై సితార వాయిద్యం వినిపించిన ఓ యువకుడి వీడియో ఆనంద్ మహీంద్రాను అబ్బుర పరిచింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్కెస్ట్రా పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది రకరకాల వాయిద్యాలే. కానీ డిజిటల్ విప్లవం కళారంగంలోనూ మునుపెన్నడూ చూడని మార్పులకు దారి తీస్తోంది. గిటార్, వయోలిన్, వీణ వంటి వాద్యనాదాలు ఇప్పుడు కంప్యూటర్‌ల ద్వారా సృష్టించొచ్చు. అంతేకాదు.. కావాలంటే మొత్తం కచేరీని ఇలా పూర్తి చేసుకోవచ్చు. ఇందుకు తాజాగా ఉదాహరణగా మరో ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో (Viral) ఉంది. ఇందులో ఓ యువకుడు ఐప్యాడ్‌తో సితార లాంటి సంగీతాన్ని వినిపించడం ఏకంగా ఆనంద్ మహీంద్రానే (Anand Mahindra) అబ్బురపరిచింది. ఇలాంటి దృశ్యాలకు తాను అలవాటు పడతానో లేదో తెలీదు కానీ కుర్రాడి టాలెంట్ మాత్రం అద్భుతమని కామెంట్ చేశారు.
Viral: భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని పెళ్లైన 6 ఏళ్లకు తెలిసి..
ఆనంద్ మహీంద్రా ప్రశంసలకు పాత్రుడైన ఆ కుర్రాడి పేరు మహేశ్ రాఘవన్. వాస్తవానికి మహేశ్ రాఘవన్ (Mahesh Raghavan) ఇప్పటికే ఇంటర్నెట్‌లో చాలా పాప్యులర్. ఐప్యాడ్‌పై సితార వాయిస్తూ( Play Sitar on Ipad) అతడు సృష్టించే సంగీతానికి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. పలు శాస్త్రీయ, ఆధునిక గీతాల్ని అతడు సులువుగా ఐప్యాడ్‌పై పలికిస్తాడు. డిటిటల్ స్క్రీన్‌పై ఒడుపుగా వెళ్లను కదుపుతూ అద్భుత సంగీతాన్ని వినిపిస్తాడు. అలాంటి ఓ వీడియోతో మహేశ్.. ఆనంద్ మహీంద్రా కంటపడ్డాడు. అతడి నైపుణ్యాలను చూసి ఆయన అచ్చెరవొందారు.
Viral: తప్పు చేసి భారీ మూల్యం చెల్లించిన బబూన్ కోతి! సింహం ఏ రేంజ్‌లో రివెంజ్ తీర్చుకుందో చూస్తే..
అయితే, తన దృష్టిలో ఆర్కెస్ట్రా అంటే సంప్రదాయిక వాయిద్యాలు ఉండాలని ఆయన అన్నారు. భవిష్యత్తులో పక్కవాయిద్యాల వాళ్లందరూ ఐప్యాడ్‌లతో కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకొచ్చారు. అయితే, ఇలాంటి ఆర్కెస్ట్రాకు తాను అలవాటుపడతానో లేదో చెప్పలేను కానీ మహేశ్ రాఘవన్ టాలెంట్ అద్భుతమని కితాబునిచ్చారు. ఇక ఆనంద్ మహీంద్రా కామెంట్‌కు రిప్లై ఇచ్చిన మహేశ్ ఆయన ప్రశంసలు పొందడం తనకు దక్కిన గౌరవమని వ్యాఖ్యానించాడు. చేతులు జోడించి నమస్కరిస్తున్నట్టు ఎమోజీలు కూడా జత చేశాడు. మరి రాఘవన్ వీడియోను మీరూ ఓమారు చూడండి.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 15 , 2024 | 06:32 PM