Viral Video: చోరీ కాకుండా ఉండేందుకు స్కూటీకి లాక్ వేశాడు.. దొంగ చేసిన నిర్వాకానికి చివరకు ఖంగుతిన్నాడు..
ABN, Publish Date - Nov 29 , 2024 | 08:18 AM
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన స్కూటీని ఇంటి బయట పార్క్ చేసి, ఎవరూ చోరీ చేయకుండా సీటు వెనుక భాగంలోని ఇనుప రాడ్‌కు, స్తంభానికి లాక్ చేశాడు. ఇక తన స్కూటీని ఎత్తుకెళ్లడం ఎవరికీ సాధ్యం కాదు.. అని దీమాగా పడుకున్నాడు. అయితే ఉదయం లేచిన తర్వాత ..
రోజురోజుకూ దొంగలు తెలివిమీరిపోతున్నారు. కొందరు చోరీ చేసే విధానం చూస్తే పోలీసులు కూడా ఆశ్చర్యపోయేలా ఉంటోంది. మరికొందరు పెద్ద పెద్ద నేరాలను సైతం ఎంతో సులభంగా చేసేస్తుంటారు. ఇంకొందరు చోరీలు చేసే సమయంలో వివిధ రకాల టెక్నిక్‌లను వాడుతూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి విచిత్రమైన చోరీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన స్కూటీ చోరీ కాకుండా ఉండేందుకు లాక్ వేశాడు. అయితే చివరకు దొంగ చేసిన నిర్వాకం తెలుసుకుని ఖంగుతిన్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన స్కూటీని (Scooty) ఇంటి బయట పార్క్ చేసి, ఎవరూ చోరీ చేయకుండా సీటు వెనుక భాగంలోని ఇనుప రాడ్‌కు, స్తంభానికి లాక్ చేశాడు. ఇక తన స్కూటీని ఎత్తుకెళ్లడం ఎవరికీ సాధ్యం కాదు.. అని దీమాగా పడుకున్నాడు. అయితే ఉదయం లేచిన తర్వాత ఇంటి బయట చూసి ఖంగుతిన్నాడు.
Viral Video: ముసుగుతో వచ్చిన మహిళ.. చివరకు డాన్స్‌తో ఎలా షాక్ ఇచ్చిందో చూస్తే..
చోరీకి వచ్చిన దొంగ.. స్కూటీకి లాక్ చేయడం చూసి, సీటు భాగాన్ని అలాగే ఉంచి.. (thief stole the scooty) మిగతా అన్ని భాగాలనూ ఎత్తుకెళ్లాడు. దీంతో చివరకు లాక్ వేసిన సీటు తప్ప.. ఇంకే విడిభాగాలూ అక్కడ కనిపించలేదు. ఇలా యజమాని ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా.. దోంగ చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ దొంగ తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి చోరీ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 35 వేలకు పైగా లైక్‌లు, 2.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: పులి ఆకలి బాధ.. మొసలిని వేటాడేందుకు పరుగుపరుగున వెళ్లగా.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
Viral Video: లగేజీ బ్యాగ్ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 29 , 2024 | 08:18 AM