Viral Video: కలపడానికి ఇంకేమీ మిగల్లేదా..! ఈ పెద్దాయన చేసిన టీపై నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..
ABN, Publish Date - Apr 21 , 2024 | 04:10 PM
టీ, కాఫీని వినూత్న రీతిలో చేసే వారిని రోజూ చూస్తూనే ఉన్నాం. మొన్న రజనీకాంత్ స్టైల్లో టీ చేసే డాలీ చాయ్ వాలాను చూశాం, నిన్న కొత్తిమీర, గోధుమ గడ్డి మిక్స్ చేసి తనదైన స్టైల్లో టీ చేసిన పెద్దాయనను కూడా చూశాం. ఇలాంటి అనేక వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా..
టీ, కాఫీని వినూత్న రీతిలో చేసే వారిని రోజూ చూస్తూనే ఉన్నాం. మొన్న రజనీకాంత్ స్టైల్లో టీ చేసే డాలీ చాయ్ వాలాను చూశాం, నిన్న కొత్తిమీర, గోధుమ గడ్డి మిక్స్ చేసి తనదైన స్టైల్లో టీ చేసిన పెద్దాయనను కూడా చూశాం. ఇలాంటి అనేక వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ పెద్దాయన టీ చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘కలపడానికి ఇంకా ఏమైనా మిగిలున్నాయా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్దాయన టీని అత్యంత వినూత్న రీతిలో తయారు చేసి, అంతా అవాక్కయ్యేలా చేస్తున్నాడు. ముందుగా స్టవ్‌పై పాత్రలో నీళ్లు, పాలు, చక్కెర, టీ పొడి మిక్స్ చేసి వేడి చేశాడు. తర్వాత అందులో అరటిపండు, సపోటా, యాపిల్ పండ్లను ముక్కలుగా (Mixing fruits in tea) తరిగి వేశాడు. కొద్ది సేపటి తర్వాత అందులో సరిపడా అల్లం పేస్ట్ వేసి బాగా కలిపాడు. ఇలా చాలా సేపు వేడి చేశాక.. మొత్తానికి ఈ పండ్లతో చేసిన టీ తయారైపోయింది.
Viral Video: ఆర్మీని తలదన్నేలా సింహం ట్రైనింగ్.. పిల్లలను చెట్టు ఎలా ఎక్కిస్తుందో చూడండి..
ఫైనల్‌గా పొగలు కక్కుతున్న టీని వడబోసి, కస్టమర్లకు అందించాడు. ఈ టీ తాగిన వారిలో కొందరు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు పెదవి విరుస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా పెద్దాయన చేసిన టీపై ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అందులో కలపడానికి ఇంకేమీ మిగల్లేదా బాబాయ్’’.. అంటూ కొందరు, ‘‘టీలో కాస్త పెరుగు కలిపితే పోయేదేముందీ’’.. అంటూ మరికొందరు, ‘‘మేము చూసిన అత్యంత దారుణమైన టీలలో ఇదొకటి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.60లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Marriage Video: పెళ్లి వేదికపై వరుడి కక్కుర్తి.. వధువు పక్కనే కూర్చుని.. ఆమెకు తెలీకుండానే..
Updated Date - Apr 21 , 2024 | 04:10 PM