Viral Video: వామ్మో! రైలు సమీపానికి రాగానే.. వృద్ధురాలు ఎంత పని చేసింది.. వీడియో చూసి నెటిజన్లు ఏమంటున్నారంటే..
ABN, Publish Date - Jan 20 , 2024 | 04:48 PM
రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాగే మరికొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. కదులుతున్న రైలు నుంచి ఎక్కి, దిగే క్రమంలో కొందరు, రైలు పట్టాలు దాటుతూ మరికొందరు ప్రమాదాలకు గురవడం చూస్తూనే ఉంటాం. ఇందులో..
రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాగే మరికొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. కదులుతున్న రైలు నుంచి ఎక్కి, దిగే క్రమంలో కొందరు, రైలు పట్టాలు దాటుతూ మరికొందరు ప్రమాదాలకు గురవడం చూస్తూనే ఉంటాం. ఇందులో చాలా వరకు ప్రయాణికుల తొందరపాటు వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలు సమీపానికి వస్తుండగా ఉన్నట్టుండి వృద్ధురాలు చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వృద్ధురాలు (old woman) రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ పైకి వస్తుంది. ఇబ్బంది పడుతూ నడుస్తూనే మెల్లగా ప్లాట్‌ఫామ్ చివరకు చేరుకుంటుుంది. కొద్ది సేపు రైలు కోసం వేచి చూస్తూ ఉంటుంది. తర్వాత దూరం నుంచి రైలు రావడం చూసి ప్లాట్‌ఫామ్ నుంచి కిందకు దిగుతుంది. పట్టాలు దాటుతుందేమో అని అనుకునేలోపే సడన్‌గా వాటిపై పడుకుంటుంది. అప్పటికే సమీపానికి వచ్చిన (train accident) రైలు ఆమె పైనుంచి వెళ్లిపోతుంది.
ఈ దృశ్యం చూస్తుంటే ప్రమాదంలో వృద్ధురాలు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో! ఎంత ఘోరం జరిగింది’’.., ‘‘ఎంత కష్టం వచ్చిందో పాపం’’.., ‘‘కాలు ఇరుక్కోవడం వల్ల ప్రమాదం జరిగింది’’.., ‘‘కాదు కాదు.. ఈమె ఆత్మహత్య చేసుకుంది’’.. అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Optical illusion: ఈ కొండల్లో చిరుత పులి ఎక్కడుందో పది సెకన్లలో గుర్తించగలరా..
Updated Date - Jan 20 , 2024 | 04:48 PM