Viral video: పూల కుండీని తింటున్న యువతి.. ట్విస్ట్ ఏంటో తెలుసుకుని నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..

ABN, Publish Date - Jun 19 , 2024 | 05:32 PM

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా అనిపిస్తుంటుంది. కొందరు తమ తెలివితేటలకు పదును పెట్టి...

Viral video: పూల కుండీని తింటున్న యువతి.. ట్విస్ట్ ఏంటో తెలుసుకుని నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా అనిపిస్తుంటుంది. కొందరు తమ తెలివితేటలకు పదును పెట్టి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఓ యువతి చేసిన వింత ప్రయోగం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సదరు యువతి పూల కుండీని తినడం చూసి నెటిజన్లు అవాక్కయ్యారు. అయితే చివరకు అసలు విషయం తెలుకుని అంతా నోరెళ్లబెడుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) పార్క్‌లో ఏర్పాటు చేసిన పూల కుండీ (flower pot) వద్దకు పరుగెత్తుకుంటూ వస్తుంది. చివరకు ఆ కుండీని నోట్లో పెట్టుకుని కరకరా నమిలి మింగేస్తుంది. యువతి చేసిన ఈ నిర్వాకం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అయితే చివరకు అసలు విషయం తెలుసుకుని నోరెళ్లబెట్టారు. అది చూసేందుకు పూలకుండీయే అయినా.. దాన్ని మొత్తం చాక్లెుట్ క్రీమ్‌తో తయారు చేసింది.

Viral video: బీచ్‌లో యువతి విచిత్ర నిర్వాకం.. చివరకు ఎలాంటి షాక్ తగిలిందో చూడండి..


ఇందుకోసం ఆమె ముందుగా.. చాక్లెట్ ముక్కలను ప్లేట్‌లో వేసి మైక్రోవోవెన్‌లో హీట్ చేసింది. కరిగిన చాక్లెట్ క్రీమును బయటికి తీసి, దాన్ని కుండీ ఆకారంలో మారుస్తుంది. ఇందుకోసం క్రీమ్‌ను ఓ కాగితపు గ్లాసులో పోసి, ఫ్రిడ్జ్‌లో పెడుతుంది. అది చల్లబడ్డాక కాగితపు గ్లాసును కట్ చేసి తీయగా.. చాక్లెట్ కుండీ తయారవుతుంది. చివరగా అందులో బ్లాక్ కేక్, ఓరియో బిస్కట్లను పొడిని వేస్తుంది.

Viral: పెళ్లి జరుగుతుండగా వేదిక వెనుక వైపు వెళ్లిన వరుడు.. అనుమానం వచ్చి వధువు కూడా వెళ్లగా.. చివరకు..


ఇలా ఫైనల్‌గా దాన్ని పూల కుండీలా మార్చేస్తుందన్నమాట.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువతి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘చూసేందుకు అచ్చం పూలకుండీలాగే ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 17 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: సముద్రం ఒడ్డున ప్రేమికుల సరసాలు.. వద్దంటున్నా యువతి బలవంతంగా చేసిన పనికి..

Updated Date - Jun 19 , 2024 | 05:32 PM

Advertising
Advertising