Viral Video: వామ్మో.. బతికుండగానే గోతిలో పూడ్చేశారు.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ABN, Publish Date - Aug 15 , 2024 | 05:10 PM

‘‘కూటి కోసం కోటి విద్యలు’’.. అన్న చందంగా కొందరు తమ కడుపు నింపుకోవడం కోసం రోడ్లపై వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. మరికొందరు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ ఏవేవో సాహసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో...

Viral Video: వామ్మో.. బతికుండగానే గోతిలో పూడ్చేశారు.. చివరకు ఏం జరిగిందో చూడండి..

‘‘కూటి కోసం కోటి విద్యలు’’.. అన్న చందంగా కొందరు తమ కడుపు నింపుకోవడం కోసం రోడ్లపై వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. మరికొందరు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ ఏవేవో సాహసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుంతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తిని బతికుండగానే గోతిలో పూడ్చేశారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి గొయ్యి పక్కన కూర్చుని ఉంటాడు. అతడి ఓ వైపు యువకుడు, మరో వైపు ఓ మహిళ కూర్చని ఉంటుంది. విన్యాసం చేసే ముందు వారంతా అందరికీ నమస్కారం చేస్తారు. తర్వాత మధ్యలో ఉన్న వ్యక్తి తలకు గుడ్డ చుట్టుకుని, ఎదురుగా ఉన్న గొయ్యిలో పడుకుంటాడు. తర్వాత పక్కన ఉన్న వారు (Man buried alive in pit) అతడిపై మట్టి పోసి పూడ్చేస్తారు.

Viral Video: బైకుపై వెళ్తూ వినూత్నంగా రీల్ చేయాలనుకున్నారు.. వేగంగా వెళ్తూ మధ్యలో వెనుక్కు తిరిగి చూడగా..


ఇలా అతన్ని నడుము వరకూ కనిపించకుండా పాతిపెడతారు. తర్వాత మళ్లీ యథావిధిగా అతడికి రెండు వైపులా కూర్చుని అందరికీ దండం పెడతారు. ఇలా చాలా సేపు వారు అలా కూర్చునే దండం పెడుతుంటారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి అతన్ని మట్టిలో నుంచి బయటికి తీశారని అర్థమవుతోంది. అయినా అందరికీ సాధ్యం కాని ఇలాంటి ప్రమాదకర విన్యాసం చేసిన ఇతన్ని చూసి అంతా షాక్ అవుతున్నారు.

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి ప్రమాదకర విన్యాసాలను ఎవరూ చేయొద్దు’’.. అంటూ కొందరు, ‘‘డబ్బులు, వ్యూస్, లైక్‌ల కోసం ఇలా చేయడం ప్రాణాలకే ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ కప్ప టాలెంట్ మామూలుగా లేదుగా.. పాము వద్దకు వెళ్లి అది చేసిన నిర్వాకం చూస్తే..

Updated Date - Aug 15 , 2024 | 05:10 PM

Advertising
Advertising
<