Viral Video: కుక్క, కోడి, కోతి.. కామెడీ మామూలుగా లేదుగా.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN, Publish Date - Jul 11 , 2024 | 08:07 AM

బద్ధశత్రువులైన జంతువులు కొన్నిసార్లు చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూస్తుంటాం. పిల్లితో స్నేహంగా ఉండే కుక్కను, అలాగే ఎలుకతో కలిసిపోయే పిల్లిని ఇలా అనేక రకాల జంతువులను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ..

Viral Video: కుక్క, కోడి, కోతి.. కామెడీ మామూలుగా లేదుగా.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..

బద్ధశత్రువులైన జంతువులు కొన్నిసార్లు చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూస్తుంటాం. పిల్లితో స్నేహంగా ఉండే కుక్కను, అలాగే ఎలుకతో కలిసిపోయే పిల్లిని ఇలా అనేక రకాల జంతువులను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. శత్రవులైన కోడి, కుక్క, కోతి కలిసిపోయాయి. ఒకేచోట చేరిన ఆ మూడు చివరకు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా కోడిని చూడగానే కుక్కలు వేటాడుతుంటాయి. అలాగే కోతులను చూసినా కుక్కలు వెంటనే వెంటబడుతుంటాయి. ఈ మూడు కలిసిపోవడం అంటూ జరగదు అని అనుకుంటాం. కానీ దీన్ని నిజం చేస్తూ కోడి, కుక్క, కోతి కలిసిపోయిన (Cock dog monkey friendship) అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతటితో ఆగని కోతి.. కుక్కను ఓదారుస్తూ దాని నాలుకను తన నాలుకతో టచ్ చేస్తూ ప్రేమ కురిపించింది.

Viral Video: గోర్లు కొరికే అలవాటు ఉందా.. అయితే ఈ వీడియో చూస్తే.. చచ్చినా ఆ పని చేయరు..


కుక్క పిల్ల కూడా కోతి పట్ల స్నేహంగా మెలిగింది. అలాగే ఆ పక్కనే ఉన్న కోడి కూడా వాటితో స్నేహంగా ఉంటూ కదలకుండా కూర్చుండిపోయింది. ఇలా ఈ మూడూ కలిసి ఒకదానిపై ఇంకొకటి ప్రేమ కురిపించుకోవడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘కుక్కపై కోతి ప్రేమ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇది కదా నిస్వార్థమైన స్నేహమంటే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: గదిలోకి వెళ్లిన టీచర్‌తో హెచ్ఎం పాడుపని.. వీడియో చూసి మండిపడుతున్న నెటిజన్లు..

Updated Date - Jul 11 , 2024 | 08:07 AM

Advertising
Advertising
<