ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఈ రూపాయిని ఎత్తుకెళ్లడం ఎవరి తరమూ కాదేమో.. ఇతను ఏం చేశాడో చూస్తే..

ABN, Publish Date - Nov 29 , 2024 | 12:47 PM

వింత వింత ఆలోచనలు, విచిత్ర ప్రయోగాలకు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మారుతోంది. చాలా మంది వినూత్నంగా ఆలోచిస్తూ ఏవేవో ప్రయత్నాలు చేస్తూ.. తద్వారా వైరల్ అవడంతో పాటూ డబ్బులు కూడా ఆర్జిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు చిత్రవిచత్రంగా ఆలోచిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఇలాంటి..

వింత వింత ఆలోచనలు, విచిత్ర ప్రయోగాలకు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మారుతోంది. చాలా మంది వినూత్నంగా ఆలోచిస్తూ ఏవేవో ప్రయత్నాలు చేస్తూ.. తద్వారా వైరల్ అవడంతో పాటూ డబ్బులు కూడా ఆర్జిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు చిత్రవిచత్రంగా ఆలోచిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఇళాంటి వీడియోలను నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రూపాయిని దాచిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ రూపాయిని చోరీ చేయడం ఎవరి తరమూ కాదేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రూపాయి నాణేన్ని దాచిన విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వ్యక్తి నాణేన్ని దాచడం కోసం మొదటగా నారింజ పండు తీసుకున్నాడు. దాన్ని తొక్క తీసి నాణేన్ని లోపల చొచ్చించాడు. తర్వాత నారింజ తొక్కను యథావిధిగా మూసేసి, దాన్ని తీసుకుని పగిలిపోయిన గుడ్డులో పెడతాడు. ఆ తర్వాత గుడ్డు పొరను తీసుకుని యథాస్థానంలో అతికిస్తాడు.

Optical illusion: మీ చూపు నిజంగా పదునైనదే అయితే.. ఈ అడవిలో దాక్కున్న కప్పను 30 సెకన్లలో కనిపెట్టండి..


ఆపై గుడ్డుపై గమ్ మూయడంతో పాటూ పెయింట్ కూడా వేసి అచ్చం మామూలు గుడ్డులా తయారు చేస్తాడు. ఆపై ఆ గుడ్డును యాపిల్ కాయ మధ్యలో సెట్ చేస్తాడు. మళ్లీ దానికి గమ్ పూసేసి యాపిల్ తొక్కను అతికించి పండు కలర్ పూసి అచ్చం మామూలు యాపిల్‌లా చేస్తాడు. చివరగా ఆ యాపిల్ పండును.. ఓ చెక్కలో రంధ్రం చేసి, అందులో దాచిపెడతాడు. మళ్లీ ఎలాంటి డౌట్ రాకుండా ఆ రంధ్రంలో పొద్దుతిరుగుడు విత్తనాలు పోసి, పెవీక్విక్ పూస్తాడు. ఆ తర్వాత దానిపై చెక్క కలర్ లాంటి పెయింట్‌ను పూసి, ఎలాంటి అనుమానం రాకుండా చెక్కను యథావిధిగా సెట్ చేస్తాడు. ఇలా ఆ నాణేని ఎవరూ కనిపెట్టని విధంగా దాచి పెట్టి అంతా అవాక్కయ్యేలా చేస్తున్నాడు.

Viral Video: సినిమా షూటింగ్ అనుకుంటే పొరబడ్డట్లే.. బైకు ప్రమాదం చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..


కాగా, ఈ వీడియో ప్రస్తుత సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘ఈ నాణేన్ని చోరీ చేయడం దేవుడి వల్ల కూడా కాదేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1200 కి పైగా లైక్‌లు, 5 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాంటి నిర్మాణం ఎక్కడైనా చూశారా.. ఇంజినీర్ ఎవరో గానీ సన్మానం చేయాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 29 , 2024 | 12:52 PM