Viral Video: బైక్ ఇలాక్కూడా నడపొచ్చా.. నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి బ్రో..
ABN, Publish Date - Mar 23 , 2024 | 09:33 PM
కొందరు చిన్న చిన్న కష్టాలకే తీవ్రంగా కుంగిపోతుంటారు. ఈ క్రమంలో చాలా మంది ఆత్మహత్యలకూ పాల్పడుతుంటారు. అయితే మరికొందరు మాత్రం ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడి జీవితంలో అనుకున్నది సాధిస్తుంటారు. ఇంకొందరైతే అవయవాలు సరిగ్గా లేకున్నా.. తామేమీ తక్కువ కాదంటూ..
కొందరు చిన్న చిన్న కష్టాలకే తీవ్రంగా కుంగిపోతుంటారు. ఈ క్రమంలో చాలా మంది ఆత్మహత్యలకూ పాల్పడుతుంటారు. అయితే మరికొందరు మాత్రం ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడి జీవితంలో అనుకున్నది సాధిస్తుంటారు. ఇంకొందరైతే అవయవాలు సరిగ్గా లేకున్నా.. తామేమీ తక్కువ కాదంటూ వివిధ రకాల సాహసాలు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రెండు చేతులూ లేకున్నా.. చిన్న ట్రిక్‌తో బైక్ నడపడం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రెండు చేతులూ లేని ఓ వ్యక్తి బైక్ నడిపేందుకు సిద్ధమవుతాడు. ఇందుకోసం అతను ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకున్నాడు. ఓ ఇనుప కడ్డీని రింగులుగా చుట్టేసి మోచేతి నుంచి బైక్ హ్యాండిల్‌కు జాయింట్ చేశాడు. ఇలా రెండు చేతులకూ ఏర్పాటు చేసుకుని బైక్ స్టార్ట్ చేశాడు. వెనుక ఇద్దరిని ఎక్కించుకుని మరీ.. ఎంతో పర్‌ఫెక్ట్‌గా బండిని నడిపాడు.
Viral Video: కుక్క పదే పదే విసిగిస్తోందని.. ఈ పిల్లాడు చేసిన పని చూడండి..
సాధారణ వ్యక్తులు నడిపినట్లుగానే ఇతను బైక్ నడిపిన విధానం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘వావ్..! ఇతడి టాలెంట్ మూమూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘నీ టాలెంట్ సూపర్ బ్రో’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి ప్రయోగాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1900కి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: కోతులను ఎలా కూల్ చేయాలో.. ఇతడికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనుకుంటా..
Updated Date - Mar 23 , 2024 | 09:33 PM