Viral Video: వాట్ ఎన్ ఐడియా సర్జీ..! ఉజాలాతో సరికొత్త ప్రయోగం.. చివరికి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందంటే..
ABN, Publish Date - Feb 20 , 2024 | 08:48 PM
ప్రస్తుత యువత బాడీ ఫిట్నెస్తో పాటూ డ్రస్సింగ్, హెయిర్ స్టైల్‌కి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం కొందరు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. ఈ క్రమంలో చాలా మంది...
ప్రస్తుత యువత బాడీ ఫిట్నెస్తో పాటూ డ్రస్సింగ్, హెయిర్ స్టైల్‌కి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం కొందరు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. ఈ క్రమంలో చాలా మంది వినూత్న ప్రయోగాలు చేయడం కూడా చూస్తూ ఉంటాం. కొందరైతే తమ జుట్టుపై చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుండడం కూడా చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ హెయిర్ స్టైలిస్ట్ ఉజాలాతో సరికొత్త ప్రయోగం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వాట్ ఎన్ ఐడియా సర్జీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. హెయిర్ స్టైలిస్ట్ వినూత్న ప్రయోగం చేశాడు. తక్కువ ఖర్చుతో ఎక్కవ ఫలితాన్ని రాబట్టాలనే ఉద్దేశంతో చివరకు అతను ఉజాలాను ఎంచుకున్నాడు. దాంతో వెంట్రుకలను సరికొత్తగా (Hair style with Ujala) మార్చాలనే ప్రయత్నం చేశాడు. ఇందుకోసం ముందుగా యువకుడి జుట్టుపై ఉజాలా పోశాడు. జుట్టును బాగా తడిపిన తర్వాత ఆరబెట్టాడు.
కాసేపటి తర్వాత వెంట్రుకలను చూడగా.. స్టైలిష్‌గా కనిపించాయి. సాధారణంగా దుస్తులను తెల్లగా మార్చే ఉజాలా.. ఈ యువకుడి జుట్టును నీలం రంగులో అందంగా మార్చేసింది. ఫైనల్‌గా అతడి హెయిర్ స్టైల్ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఉజాలాతో అందమైన హెయిర్ స్టైల్.. వాట్ ఎన్ ఐడియా సర్జీ’’.. అంటూ కొందరు, ‘‘హెయిర్ స్టైల్ చాలా బాగుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 98వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Updated Date - Feb 20 , 2024 | 08:49 PM