Viral Video: ఈ తాత మరీ అమాయకంగా ఉన్నాడే.. ఫోన్‌ను ఎలా శుభ్రం చేస్తున్నాడో చూస్తే అవాక్కవుతారు..
ABN, Publish Date - Dec 05 , 2024 | 02:59 PM
కొందరు తెలిసీ తెలీక చేసే పనులు అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటాయి. మరికొందరు చేసే పనులు చూసే వారికి తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఇటీవల తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వృద్ధుడు ..
కొందరు తెలిసీ తెలీక చేసే పనులు అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటాయి. మరికొందరు చేసే పనులు చూసే వారికి తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఇటీవల తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వృద్ధుడు తన ఫోన్‌ను శుభ్రం చేయబోయి.. చివరకు అంతా షాక్ అయ్యేలా చేశాడు. ఈ తాత చేసిన పని చూసి అంతా అవాక్కతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘అయ్యో.. ఈ తాతా మరీ అమాయకత్వంగా ఉన్నాడే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. నీళ్ల కొళాయి వద్ద ఉన్న ఓ వృద్ధుడు.. కాళ్లు, ముఖం కడుక్కున్నాడు. అయితే ఆంతలో అతడికి తన జేబులోని కీప్యాడ్ ఫోన్ (Keypad phone) గుర్తొచ్చింది. దాన్ని కూడా శుభ్రం చేసుకుంటే ఒక పని అయిపోతుందని అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా జేబులోని ఫోన్ తీసుకుని, అక్కడే ఉన్న బట్టల సోపును దానికి పూసి మరీ శుభ్రం చేశాడు.
Viral Video: ఆరబెట్టిన వడియాలకు పులి కాపలా.. మేడపైన ఎలా సెట్ చేసిందో చూస్తే.. నోరెళ్లబెడతారు..
ఆ తర్వాత దాన్ని ఏకంగా కొళాయి నీటిలో (old man cleaned the phone in tap water) ముంచి మురికి పోయేలా శుభ్రంగా కడిగేస్తాడు. అయితే అలా చేయడం వల్ల ఫోన్ దెబ్బతింటుందని మాత్రం ఊహించలేకపోయాడు. గతంలో ఓ మహిళ సీలింగ్ ఫ్యాన్‌పై నీళ్లు పోసి కడిగడాన్ని కూడా చూశాం. అలాగే ఇంకో మహిళ తన ల్యాప్‌టాప్‌ను కూడా ఇలాగే శుభ్రం చేసింది. కానీ ప్రస్తుతం ఈ వృద్ధుడు అమాయకత్వంతో చేసిన ఈ పని చూసి అంతా అవాక్కవుతున్నారు.
Viral Video: సామాన్లు తరలించడం ఇంత ఈజీనా.. ఇతడి ట్రిక్ మామూలుగా లేదుగా..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది అసలైన వాటర్‌ప్రూఫ్ ఫోన్’’.. అంటూ కొందరు, ‘‘ఇది ఐ ఫోన్ ఆల్ట్రా 17 ప్రోమ్యాక్స్.. నీళ్లలో ముంచినా ఏమీ కాదు’’.., ‘‘అయ్యో.. ఈ తాతా మరీ అమాయకత్వంగా ఉన్నాడే’’.. అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7వేలకు పైగా లైక్‌లు, 3.80 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 05 , 2024 | 08:41 PM