ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: మాజీ పోలీసు అధికారి కొడుకు దారుణం.. గర్ల్‌ఫ్రెండ్ కోసం తెచ్చిన బర్గర్‌లో సగం ఫ్రెండ్ తిన్నాడని..

ABN, Publish Date - Apr 25 , 2024 | 07:45 PM

పాకిస్థాన్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మాజీ పోలీసు అధికారి కొడుకు తన స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ కోసం తెచ్చిన బర్గర్‌లో సగం తినేసిన స్నేహితుడితో గొడవపడి తుపాకీతో కాల్చి చంపేశాడు.

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌లో (Pakistan) తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మాజీ పోలీసు అధికారి కొడుకు తన స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ కోసం తెచ్చిన బర్గర్‌లో సగం తినేసిన స్నేహితుడితో గొడవపడి తుపాకీతో కాల్చి చంపేశాడు. ఫిబ్రవరిలో కరాచీ నగరంలో ఈ ఘటన జరగ్గా బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మాజీ పోలీసు ఉన్నతాధికారి నజీర్ అహ్మద్ మిర్‌బహార్ కుమారుడు దనియాల్ నజీర్ (17) తన గర్ల్‌ఫ్రెండ్ షాజియాను ఫిబ్రవరి 8న పార్టీ కోసం తన ఇంటికి ఆహ్వానించాడు. అప్పటికే అతడి స్నేహితులు అలీ కీరియో, అతడి తమ్ముడు అహ్మర్ అక్కడ ఉన్నారు. అలీ, అహ్మర్‌ల తండ్రి స్థానిక సెషన్స్ జడ్జిగా ఉన్నారు (Pak Ex Cops Son 17 Kills Friend For Eating Half His Girlfriends Burger).

Leopard Attack: చిరుత దాడి నుంచి తృటిలో తప్పించుకున్న జింబాబ్వే మాజీ క్రికెటర్


ఇదిలా ఉంటే, దనియాల్ తనకు, తన గర్ల్‌ఫ్రెండ్‌‌కు బర్గర్లు ఆర్డరిచ్చి తెప్పించుకున్నాడు. అయితే, గర్ల్‌ఫ్రెండ్‌ కోసం ఉద్దేశించిన బర్గర్‌ను కీరియో తినేయడంతో దనియాల్ అతడితో గొడవకు దిగాడు. వివాదం ఒక్కసారిగా ముదరడంతో విచక్షణ కోల్పోయిన దనియాల్ భద్రతా సిబ్బందికి చెందిన ఓ రైఫిల్‌‌తో కీరియోపై కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలతో నేలకొరిగిన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై జరిపిన దర్యాప్తులో దనియాల్ కాల్పుల వల్లే కీరియో మరణించినట్టు తేలింది. దీంతో, పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. త్వరలో అతడిపై కోర్టులో విచారణ ప్రారంభం కానుంది .

Read Viral and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 07:50 PM

Advertising
Advertising