Viral: ఇతను రియల్ బిచ్చగాడు.. నానమ్మ జ్ఞాపకార్థం ఖరీదైన విందు.. ఖర్చు ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN, Publish Date - Nov 20 , 2024 | 07:48 PM
బిచ్చగాడు సినిమాలో తల్లి ఆరోగ్యం బాగుండాలని కోటీశ్వరుడు రోడ్ల మీద పడి అడుక్కుంటాడు. కోటీశ్వరుడైన వ్యక్తి తల్లి ఆరోగ్యంగా ఉండడం కోసం బిచ్చగాడిలా నటించడం అందరికీ తెగ నచ్చేసింది. అయితే ఇలాంటివన్నీ సినిమాల్లోనే సాధ్యం అని అంతా అనుకుంటాం. కానీ నిజ జీవితంలో ఓ బిచ్చగాడు నానమ్మ జ్ఞాపకార్థం కోట్లు ఖర్చు చేసిన వినూత్న ఘటన చోటు చేసుకుంది..
బిచ్చగాడు సినిమాలో తల్లి ఆరోగ్యం బాగుండాలని కోటీశ్వరుడు రోడ్ల మీద పడి అడుక్కుంటాడు. కోటీశ్వరుడైన వ్యక్తి తల్లి ఆరోగ్యంగా ఉండడం కోసం బిచ్చగాడిలా నటించడం అందరికీ తెగ నచ్చేసింది. అయితే ఇలాంటివన్నీ సినిమాల్లోనే సాధ్యం అని అంతా అనుకుంటాం. కానీ నిజ జీవితంలో ఓ బిచ్చగాడు నానమ్మ జ్ఞాపకార్థం కోట్లు ఖర్చు చేసిన వినూత్న ఘటన చోటు చేసుకుంది. ఓ బిచ్చగాడు తన నానమ్మ జ్ఞాపకార్థం లక్షలు ఖర్చు చేసి, ఖరీదైన విందు ఏర్పాటు చేశాడు. ఇందుకోసం అతను చేసిన ఖర్చు చూసి కుబేరులు కూడా అవాక్కవుతున్నారు. ఈ బిచ్చగాడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌లో (Pakistan) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక గుజ్రాన్‌వాలా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి స్థానికంగా ఆడుక్కుంటుంటాడు. ఇందులో విశేషం ఏముందీ.. అని మీకు సందేహం రావొచ్చు. ఈ బిచ్చగాడు (beggar) ఇటీవల ఇచ్చిన ఖరీదైన విందు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ బిచ్చగాడి నానమ్మ ఇటీవల మరణించింది. 40 రోజుల ఆమె జ్ఞాపకార్థం ఖరీదైన విందు (expensive dinner) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు.
Viral Video: సింహాల వేట ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా.. జిరాఫీని ఎలా వేటాడాయో చూస్తే..
ఈ విందు కోసం సిరి పాయే, మురబ్బ తదితర సాంప్రదాయాలతో సుమారు 250 మేకలతో అనేక రకాల మాంసాహారాలను సిద్ధం చేశాడు. అలాగే పలు రకాల స్వీట్లను కూడా సిద్ధం చేశాడు. డిన్నర్‌కు మటన్, నాన్ మటార్ గంజ్ (స్వీట్ రైస్)తో పాటు పలు వంటకాలను సిద్ధం చేయించాడు.ఇక ఈ విందుకు గుజ్రాన్‌వాలా ప్రాంతానికి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల్లో అందరికీ ఆహ్వానాలు పంపించాడు. బిచ్చగాడు ఖరీదైన విందు ఇస్తున్నాడని తెలియడంతో నలుమూలల నుంచి సుమారు 20,000 మంది అతిథులు హాజరయ్యారు. ఈ బిచ్చగాడు అందరికీ ఆహ్వానాలు అందించి సరిపెట్టకుండా వారిని తరలించేందుకు 2000కు పైగా వాహనాలను కూడా ఏర్పాటు చేశాడు.
Viral Video: అడుగు వేసే ముందు ఆలోచించాల్సిందే.. ఈ పొలంలో సీన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..
గుజ్రాన్‌వాలాలోని రైల్వే స్టేషన్ సమీపంలోని ఖాళీ స్థలంలో కార్యక్రమాన్ని నిర్వహించాడు. విందుకు వచ్చిన అతిథులంతా వంటలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక ఈ విందు కోసం బిచ్చగాడు 1.25 కోట్ల పాకిస్థాన్ డబ్బులను ఖర్చు చేసినట్లు తెలిసింది. కాగా, ఈ విందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఒక బిచ్చగాడు అయ్యుండి.. ఇంత డబ్బులు ఎలా సంపాదించాడు’’.. అంటూ కొందరు, ‘‘నానమ్మ జ్ఞాపకార్థం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గ్రేట్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: బస్సులో కిటికీ బయట చేతులు పెడుతున్నారా.. ఇది చూస్తే చచ్చినా అలా చేయరు..
ఇవి కూడా చదవండి..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
Viral Video: లగేజీ బ్యాగ్ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..
Viral Video: మేత పెట్టలేదని ఈ ఆవు చేసిన పని చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 20 , 2024 | 07:48 PM