Viral: ప్రయాణికుడి ఫస్ట్ క్లాస్ సీటును ఓ కుక్కకు కేటాయించిన ఎయిర్‌లైన్స్!
ABN, Publish Date - Dec 23 , 2024 | 02:16 PM
తనకు కేటాయించిన సీటులో ఓ కుక్కను కూర్చోబెట్టారంటూ అమెరికన్ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేసిన వైనం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: తనకు కేటాయించిన సీటులో ఓ కుక్కను కూర్చోబెట్టారంటూ అమెరికన్ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేసిన వైనం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది. కొందరు బాధితుడి పక్షాన నిలుస్తుంటే మరికొందరు ఎయిర్‌లైన్స్ సంస్థకు మద్దతునిచ్చారు. రెడిట్‌లో సదరు ప్రయాణికుడు ఈ ఉదంతాన్ని పంచుకున్నాడు (Viral).
Viral: ఇద్దరు భర్తలతో మహిళ కాపురం! ఎలా మేనేజ్ చేస్తున్నావని అడిగితే..
డెల్టా ఎయిర్‌లైన్స్‌లో టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుడు అసలేమైందో తన పోస్టులో పూర్తిగా వివరించారు. తొలుత తన టిక్కెట్‌ను ఫస్ట్ క్లాస్ టిక్కెట్‌గా అప్‌గ్రేడ్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. ఆ తరువాత 15 నిమిషాలకే తనకు పాత సీటు ఇచ్చినట్టు వివరించారు. ఈ క్రమంలో తనకు మొదట కేటాయించిన ఫస్ట్ క్లాస్ సీటు వద్దకు వెళ్లి చూడగా అక్కడో సర్వీస్ కుక్క కనిపించిందని అన్నారు. ఇంతకాలంగా తాను ఇదే ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తుంటే చివరకు దక్కిన గుర్తింపు ఇదా అని ప్రశ్నించాడు.
ఈ విషయమై ఎయిర్‌లైన్స్ సంస్థను ప్రశ్నించగా తాము చేయగలిగిందేమీ లేదని వారు సమాధానమిచ్చారని అన్నారు. ఎయిర్‌లైన్స్ నిబంధనల ప్రకారం, సర్వీస్ కుక్కలకు తొలి ప్రాధాన్యమని వారు చెప్పారట. కాగా, ఈ ఘటనపై అనేక మంది పెద్ద ఎత్తున స్పందించారు. అమెరికాలో ఇలాగే జరుగుతుంటుందని కొందరు నిట్టూర్చారు.
Viral: ఆడ తోడు లేని మగాళ్లే ఆమె టార్గెట్! ఫేక్ కేసులతో రూ.1.25 కోట్లు లూటీ!
కాగా, ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ ఉద్యోగి ఒకరు స్పందించారు. ప్రయాణికుడికి తొలుత కేటాయించిన ఫస్ట్ క్లాస్ సీటులో కాళ్లు జాపుకునేందుకు అదనపు జాగా ఉంటుందని, ఇలాంటి వాటిని వికలాంగులు లేదా వారి సేవకు వినియోగించే సర్వీస్ కుక్కలకు కేటాయిస్తారని వివరించారు. ఇది ఎయిర్ లైన్స్ నిబంధన అని, ఈ విషయంలో అభ్యంతరం పెట్టాల్సిందేమీ లేదని అన్నారు.
ఏమిటీ సర్వీస్ డాగ్స్
వికలాంగులకు సహాయంగా ఉండేందుకు ప్రత్యేక తర్ఫీదు పొందిన కుక్కలను సర్వీస్ డాగ్స్ అని అంటారు. వ్యక్తుల వైకల్యాన్ని బట్టి వీటికి శిక్షణ ఇస్తారు. కొన్నేళ్ల పాటు కఠిన శిక్షణ అనంతరం వీటిని దివ్యాంగులకు ఇస్తుంటారు. అంధత్వం ఉన్న వారికి దారి చూసేందుకు, వినికిడి సమస్య ఉన్న వారిని శబ్దాలను గుర్తించి అప్రమత్తం చేసేందుకు ఈ కుక్కలకు శిక్షణ ఇస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇక నడవలేని వారి కోసం ఇంటి తలుపులు తీయడం, ఫ్రిడ్జ్‌లోని వస్తువులు తీసివ్వడం వంటి వాటిల్లో కూడా కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఉందని అంటున్నారు. ఇలాంటి కుక్కలకు పబ్లిక్ ప్లేసుల్లో తొలి ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. అవి కనిపించినప్పుడు తలపై నిమరడం, తాకడం లాంటి పనులతో వాటికి అడ్డు వెళ్లొద్దని కూడా చెబుతున్నారు.
Viral: ఎయిర్ ఇండియాలో సేవాలోపం! లైఫ్‌లో కీలక ఘట్టానికి దూరమైన ప్రయాణికురాలు
Updated Date - Dec 23 , 2024 | 02:22 PM